The Paradise Film: నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise Film)ఈ సినిమాకు ప్రమోషన్స్ సినిమా లాగానే చాలా డిఫరెంట్. పోస్టర్ కు జడలు కట్టి ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందు వచ్చిన గ్లింప్స్‌లో నాని చూసిన తర్వాత.. ఇప్పటి వరకు ఆయన చేయని పాత్రలో, ఓ వైవిధ్యమైన పాత్రను చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ పాత్ర మాత్రం చాలా వైలెంట్ గా ఉంది. ఈ సినిమాలో నాని పాత్రను కూడా ఇప్పటికే ‘జడల్’ అని రివీల్ చేశారు మూవీ టీం. ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Read also- CM Revanth Reddy: ఏం కావాలో రాసి పెట్టుకోండి.. మీ వద్దకే వచ్చి జీవోలు ఇస్తా.. సీఎం బంపరాఫర్!
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బోల్డ్ విజన్‌ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ నుంచి ప్రతి ఫ్రేమ్ వరకూ తన బ్రిలియన్స్‌ని చూపించారు దర్శకుడు. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ వ్యాల్యూస్ మరో హైలైట్ అనేలా, ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అలాగే రా, రియలిస్టిక్ టోన్‌తో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ప్రతి ఫ్రేమ్‌కి థ్రిల్‌ని జోడించి, థ్రిల్ కలిగించే మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రాఘవ్ జుయల్ కీలక పాత్ర చేస్తూ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బలమైన క్యారెక్టర్స్‌తో కూడిన కథ, స్ట్రాంగ్ కంటెంట్‌తో పాటు విజువల్ ట్రీట్‌లో ఈ సినిమా ఉంటుందనేది ఇప్పటి వరకు వచ్చిన ప్రతీది తెలియజేస్తుండటంతో ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. మొత్తం ఎనిమిది భాషల్లో 26 మార్చి 2026న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
JADAL OWNS THE STREETS 💥💥#TheParadise promotions begin in a massive way with 3D hoardings set up for Jadal's look ❤🔥
Do share if you spot it.This is just the beginning ⚡🔥
In CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam,… pic.twitter.com/SHAXVTHr4U— SLV Cinemas (@SLVCinemasOffl) August 25, 2025