vishal(image:x)
ఎంటర్‌టైన్మెంట్

Vishal’s Movie Title: విశాల్ కొత్త మూవీ టైటిల్ రిలీజ్.. ఇదేం మాసురా మామా..

Vishal’s Movie Title: దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న హీరోల్లో విశాల్ ఒకరు. తమిళంతో పాటు ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా మంచి హిట్స్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ‘మధ గజ రాజా’ పూర్తి అయిన 12 సంవత్సరాల తర్వాత విడుదలై మంచి హిట్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత విశాల్ తన 35 సినిమాను ప్రముఖ నిర్మాత అయిన ఆర్‌బీ చౌదరి ప్రతిష్టాత్మక బేనర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ బేనర్ తెలుగు తమిళ చిత్రాల్లో అనేక విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. అనేక కొత్త దర్శకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రస్తుతం విశాలతో నిర్మిస్తున్న చిత్రం ఈ నిర్మాణ సంస్థకు 99 వ సినిమాగా విశాల్ కి 35 సినిమాగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు.

Read also- OG Movie Update: ‘ఓజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఈ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే

విశాల్, దుషార విజయన్ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిశారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో కలిసి పని చేయనున్నారు. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేయనున్నారు.

Read also- Coolie Day10 Collections: తలైవా అడుగెడితే రికార్డులు బద్దలే.. వామ్మో ఈ కలెక్షన్స్ ఏంది సామీ

టైటిల్ టీజర్ ను చూస్తుంటే.. సముద్రంలో నుంచి కెమెరా ఓపెన్ అవుతోంది. తిమింగాళాలు, చేపలు ఇలా ప్రతి దాన్ని చూపించుకుంటూ చివరిగా ఓ పీత దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ పీత ఓ ఓడపైకి ఎక్కి ఏదో ఈవెంట్ జరగడాన్ని చూస్తుంది. అక్కడ విశాల్ వెనుక నుంచి కనిపిస్తారు. అక్కడ విశాల్ స్వాగ్ చూస్తుంటే ఈ సినిమా పోర్టులు, గ్యాంగ్ స్టార్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తుంది. జివి ప్రకాష్ అందించిన సంగీతం ఈ టైటిల్ గ్లింప్స్ కి మరింత ఎసెర్ట్ కానున్నాయి. ఇంతకూ టైటిల్ ఏంటంటే.. ‘మకుటం’. టైటిల్ చూస్తుంటే ఈ సినిమా కూడా విశాల్ కి మరో హిట్ అయ్యే అవకాశం కల్పిస్తుంది.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?