madarasi( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Madarasi Movie Update: ఇలాంటి సాంగ్ పడితే శివ కార్తికేయన్ దొరకడు.. ఇలా ఎలా అనిరుద్? 

Madarasi Movie Update: ‘అమరాన్’ హిట్ తర్వాత కోలీవుడ్‌ స్టార్ హీరో శివకార్తికేయన్ మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మదరాసి’. ఫస్ట్ టైమ్ ఈ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ అద్భుతమైన థ్రిల్‌‌తో పాటు మాస్ ఎంటర్‌టైనర్స్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హీరోయిన్ రుక్మిణీ వసంత ఇందులో శివకార్తికేయన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ (Madarasi Movie Update)నుంచి మరో సాంగ్ విడుదల చేశారు నిర్మాతలు.

Read also- Hydraa: మొదట్లో విమర్శలు.. ప్రస్తుతం ప్రశంసలు?

ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అంటే ఇక్కడే సినిమా సగం సక్సెస్ అని ఫిక్సయిపోవచ్చు. ‘వర వర వర వరదలే నా కథ కదలే అంటూ మొదలవుతుంది పాట. దీనిని అనిరుద్ రవిచంద్రన్ పాడుతూ కనిపిస్తారు. దానిని చూస్తుంటే ఆహ్లాదకరమైన మెలొడీ సాంగ్ లాగా ఉంది. ట్యూన్ కొంచెం పవన్ కళ్యాణ్ సినిమాలోని ‘గాలి వాలుగా సాగే పాటలా ఉంది. ఏది ఏమైనా మంచి మెలొడీని అందించారు మ్యూజిక్ డైరెక్టర్.

Read also-OG Movie Update: ‘ఓజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఈ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే

ఈ చిత్రంలో విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సుదీప్ ఎలమోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో మరో మంచి సక్సెస్‌ను అందుకుంటానని శివకార్తికేయన్ ధీమా వ్యక్తం చేస్తుండగా, దర్శకుడు మురగదాస్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మురగదాస్‌కి అంత కీలకమైనది. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆయన చేసిన బాలీవుడ్ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. దీంతో ఈ సినిమా విజయం మురుగదాస్‌కు ఎంతో కీలకంగా మారింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు