Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలు హవా కొనసాగుతుంది. ఇక టాలీవుడ్లో మనకు ముందుగా గుర్తొచ్చే హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి దిగ్గజాలు. వీరు సినిమాల్లో స్టార్లే కాదు, రియల్ లైఫ్ లో స్నేహితులు కూడా. ఒకరి చిత్రాలను మరొకరు సపోర్ట్ చేయడం, ఈవెంట్లలో పాల్గొని ప్రోత్సహించడం వీరి మధ్య సామాన్యం. అంతేకాదు, తమ సినిమాల్లో చేసిన పాత్రల గురించి కూడా చర్చించుకుంటూ, ఒకరినొకరు అభినందిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున మధ్య స్నేహం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. నాగార్జున సినిమా సూపర్ హిట్ అయినప్పుడు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. అలాగే, చిరంజీవి చిత్రాలు విజయవంతమైనప్పుడు నాగార్జున విషెస్ చెబుతారు.
ఇటీవల రిలీజ్ అయిన కుబేర సినిమాలో నాగార్జున నటనకు చిరంజీవి మనస్ఫూర్తిగా ప్రశంసలు కురిపించారు. కానీ, కూలీ సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి, నాగార్జున పాత్ర చూసి నిరాశకు గురైనట్లు టాక్. అంతటి స్టార్ హీరో అయిన నాగార్జున ఇలాంటి పాత్రను ఎందుకు ఒప్పుకున్నాడని చిరంజీవి బాధపడ్డారని, అసంతృప్తి వ్యక్తం చేశారని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.
“నీవు ఇంత గొప్ప నటుడివి, ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి?” అంటూ నాగార్జునకు ఫోన్ చేసి గట్టిగా అడిగారట. ముందు ముందు ఇలాంటి పాత్రలు ఎంచుకోవద్దని.. నాగ్ కి సలహా ఇచ్చారని ఓ వార్త వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనిలో ఎంత నిజం వరకు ఉందో తెలియదు కానీ, కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్చల్ అవుతోంది. చిరంజీవి, నాగార్జునల స్నేహబంధం, వారి పాత్రల ఎంపికపై జరుగుతున్న ఈ చర్చలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.