Telangana Liberation Day (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Liberation Day: విమోచన దినోత్సవం పై అధికారులు కసరత్తు.. చీఫ్ గెస్ట్‌గా కేంద్ర మంత్రి?

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా అధికారికంగా నిర్వహిస్తోంది. కాగా ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్ లో భారీగా తెలంగాణ లిబరేషన్ డే(Telangana Liberation Day)ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే ఈసారి చీఫ్ గెస్టుగా కేంద్ర రక్​షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్(Rajnath Singh) హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) సైతం హాజరయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే హైదరాబాద్(Hyderabad) సంస్థానంలో కర్ణాటక(karnataka), మహారాష్ట్ర(Maharasta)కు చెందిన పలు ప్రాంతాలు ఉండటంతో ఆ రాష్ట్రాలకు చెందిన సీఎంలను సైతం గతంలో నుంచే ఆహ్వానిస్తోంది. ఈనేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వస్తారని శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే విమోచన వేడుకల్లో పరేడ్ నిర్వహించే అవకాశముంది. ఈసారి పాల్గొనే ట్రూప్ లలో ఇండియన్ ఆర్మీ(Indian Army) కూడా భాగస్వామ్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి హాజరవుతున్న నేపథ్యంలో ఆర్మీ కూడా భాగస్వామ్యమవుతుందని విశ్వసనీయ సమాచారం.

ఘనంగా ఉత్సవాలు

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించాలని బీజేపీ(BJP) రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్​షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవంతం చేసేందుకు, సమన్వయం కోసం శాసనమండలి సభ్యుడు సీ అంజిరెడ్డి చైర్మన్ గా కమిటీని సైతం పార్టీ నియమించింది. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(MLA Paidi Rakesh Reddy), నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, శ్యాంసుందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, పీ విక్రమ్ రెడ్డి, నందకం దివాకర్ ను రాష్ట్ర నాయకత్వం నియమించింది. జన సమీకరణతో పాటు సభ ఏర్పాట్లు, సమన్వయం వంటి అంశాలపై ఈ బృందం ప్రత్యేక దృష్టిసారించనుంది.

Also Read: CM Revanth Reddy: యూరియా విషయంలో పత్తా లేని బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు

ప్రజా పాలన దినోత్సవం పేరిట

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించాలిన డిమాండ్ చేసిన బీఆర్ఎస్((BRS)) సైతం విమోచనం పేరిట ఉత్సవాలను నిర్వహించలేకపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వమించేందుకు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్(Congress) కూడా ప్రజా పాలన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. వాస్తవానికి హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం, అందులో ఔరంగాబాద్, బీడ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్భనీ జిల్లాలు, ప్రస్తుత కర్ణాటకలోని కలబురగి, బళ్లారి, రాయచూర్, యాద్గిర్ ,కొప్పల్, విజయనగరం, బీదర్ జిల్లాలు ఉండేవి.

సర్దార్ వల్లభాయ్ పటేల్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఏడాది తర్వాత అంటే 17 సెప్టెంబర్ 1948లో హైదరాబాద్(Hyderabad) సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. నాటి కేంద్ర హోంమత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) చొరవతో ఆపరేషన్ పోలో పేరిట తీసుకున్న చర్యలవల్లే హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించింది. అయితే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుకుంటున్నాయి. కానీ తెలంగాణలో ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. అందుకే కేంద్రం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇతర పార్టీలు కూడా అలర్ట్ అయి ఒక్కో పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ అంశంపై ఎవరికి వారుగా మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి.

Also Read: Telangana Grameena Bank: వికారాబాద్ జిల్లాలో నయా మోసం.. బ్యాంక్‌లో దాచిన డబ్బు మాయం?

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?