Arjun Chakravarthy Trailer: “అర్జున్ చక్రవర్తి” ఒక స్ఫూర్తిదాయకమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కబడ్డీ క్రీడాకారుడి జీవితంలోని భావోద్వేగ పోరాటాలను అద్భుతంగా చూపించారు. విజయ రామరాజు, సిజా రోజ్ హీరో హీరోయిన్ లుగా నటించారు. విఘ్నేష్ బాస్కరన్ సంగీతం, జగదీష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఎసెర్ట్‌గా మారనున్నాయి. నిర్మాత శ్రీని గుబ్బల ప్రకారం, ఈ సినిమాను ప్రామాణికంగా తీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రూపొందించారు. దర్శకుడు విక్రాంత్ రుద్ర కథను మనసును హత్తుకునేలా, మరింత వాస్తవికంగా చిత్రీకరించారు. ఈ సినిమా కబడ్డీ క్రీడను కేంద్రంగా చేసుకుని, ఒక క్రీడాకారుడి జీవితంలోని సంఘర్షణలు, విజయాలను సమర్థవంతంగా చూపించనుంది.
Read also- Warangal Crime: భర్తను హత్య చేసిన భార్య.. సహకరించిన ప్రియుడు.. ఎక్కడంటే!
“అర్జున్ చక్రవర్తి” నల్గొండకు చెందిన నాగులయ్య అలియాస్ అర్జున్ అనే ప్రతిభావంతమైన కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా. 1980లలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించిన అర్జున్ జీవితంలోని సవాళ్లు, కష్టాలు, విజయాలను ఈ చిత్రం హృదయస్పర్శిగా చిత్రీకరిస్తుంది. అర్జున్ పాత్రలో విజయ రామరాజు నటన కోసం నాలుగైదు రకాల శారీరక రూపాంతరాలు (ట్రాన్స్‌ఫర్మేషన్స్) చేశారు. ఇందుకోసం ఒక్కో రూపాంతరానికి తొమ్మిది నెలల సమయం పట్టింది. ఈ సినిమా అర్జున్ కబడ్డీ ప్రయాణంతో పాటు అతని వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగ అంశాలను కూడా ఆవిష్కరిస్తుంది.
Read also-Vishwambhara: ‘విశ్వంభర’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా..
ట్రైలర్ (Arjun Chakravarthy Trailer)చూస్తుంటే ఒక ఆశయంతో ముందుకు సాగే క్రీడాకారుడికి సమాజంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. ‘మద గజంలాంటి అర్జున్ చక్రవర్తి రెండో నెంబర్ ఆటగాడి స్థానంలో కోర్టులో అడుగు పెడుతున్నాడు’ అంటూ మొదలవుతుంది ట్రైలర్. అంటే హీరో చాలా ప్రతిభావంతుడు. అయిదే సమాజం ప్రతిభావంతులను ఎలా అణచడానికి ప్రయత్నిస్తుంది చూపించారు. ఇందులో ప్రతి డైలాగ్ అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాళీ చేతులతో కాలే కడుపుతో చేసేదే యుద్ధం అనే డైలాగ్ ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ డెప్తును తెలిపేలా ఉంది. నిర్మాణ విలువలు కూడా ఎక్కడా తగ్గకుండా ఉన్నాయి. ఎమోషన్ కు తగ్గట్టుగా విఘ్నేష్ బాస్కరన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ఎసెర్ట్ కానుంది.