Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం విడుదలకు సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. ఎప్పుడు విడుదల అవుతుందో మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ని పురస్కరించుకుని ఆగస్ట్ 22న ‘విశ్వంభర’ విడుదలకు సంబంధించిన కన్ఫ్యూజన్ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకుంటున్న సమయంలో.. రిలీజ్‌కు సంబంధించి ఇప్పుడో వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ వార్తలు వైరల్ అవుతుండగానే, ‘విశ్వంభర’ నుంచి మెగా బ్లాస్ట్ రాబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
గురువారం (ఆగస్ట్ 21) ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మెగా బ్లాస్ట్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది టీజర్‌కు సంబంధించినదా? లేదంటే విడుదల తేదీకి సంబంధించినదా? అని అంతా ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఈ సినిమా 2026 వేసవికి వాయిదా పడినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను 2026 వేసవికి.. అందులోనూ రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ విడుదల తేదీకి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
ఎందుకంటే, రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం మార్చి 30వ తేదీన విడుదలైంది. ‘పెద్ది’ సినిమా రామ్ చరణ్ బర్త్ డే రోజున, అంటే మార్చి 27న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. ‘విశ్వంభర’ కనుక 2026 మార్చికి వాయిదా పడితే మాత్రం.. ‘పెద్ది’ సినిమా కూడా వాయిదా పడుతుందని, ఆగస్ట్‌లో ఆ సినిమా విడుదలవుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే, మెగా ఫ్యాన్స్‌కు ఈ సంవత్సరం తీవ్ర నిరాశ తప్పదు. ‘పెద్ది’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు ఈ విడుదల మార్పు డిజప్పాయింట్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే.. జనవరిలో అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా, మార్చిలో ‘విశ్వంభర’, ఆగస్ట్‌లో ‘పెద్ది’, ఈ మధ్యలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఇలా చూసుకుంటే.. 2026 మెగా నామ సంవత్సరం అని రాసి పెట్టుకోవచ్చు. ఇది ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగించే విషయమే. అందులోనూ ఈ సంవత్సరం మెగా హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు. ఈ కోణంలో చూస్తే.. అదే బెటర్ అనే ఫ్యాన్స్ కూడా లేకపోలేదు.
Also Read- Coolie A Certificate: సెన్సార్ బోర్డ్‌పై కేసు.. ‘కూలీ’ లాస్ నుంచి బయటపడేందుకు పెద్ద ప్లానే వేశారుగా!
మరి ఫైనల్‌గా ఏం డిసైడ్ చేస్తారో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ‘విశ్వంభర’, ‘పెద్ది’లకు సంబంధించి ఈ విధంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘విశ్వంభర’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంటే, ‘పెద్ది’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ‘విశ్వంభర’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంటే.. ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు