Traffic ( Image Source: Twitter )
తెలంగాణ

Traffic Challans: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌ చేస్తామన్నా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

Traffic Challans: వ్యక్తిగత వాహనాలపై పెండింగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్‌ చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ వాహనదారులను హెచ్చరించారు. ఈ పెండింగ్‌ చలాన్లపై వరంగల్‌ పోలీస్ కమిషనర్ కొరడాఝా లిపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజు,రోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పాటు, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతో పాటు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవడంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అతిక్రమించి వాహనదారులు వాహనాలను నడుపతున్నారు. దీనితో పోలీసులు ట్రాఫిక్‌ నిబందనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో పోలీసులు ట్రాఫిక్‌ జరిమానాలు విధించడం జరుగుతొంది.

విధించిన ట్రాఫిక్‌ జరిమానాలను సైతం వాహనదారులు సకాలంలో జరిమానాలను చెల్లించకుండా అలసత్వం వహించడం ద్వారా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 1,27,194 వాహనలపై మొత్తం 11,71,094 చలాన్లు పెండిరంగ్‌లో వుందగా, వీటి మొత్తం సూమారు 33 కోట్ల 28 లక్షల రూపాయల్లో మొత్తం వాహనదారులు చెల్లించాల్సి వుంది. ఇందులో వరంగల్‌ ట్రాఫిక్‌ పరిధిలో 3,35,450 చలాన్లు, కాజీపేట ట్రాఫిక్‌ పరిధిలో 3,60,423, హన్మకొండ ట్రాఫిక్‌ పరిధిలో 2,73,770 చలాన్లు పెండింగ్‌లో వున్నాయి. మిగితా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం2,01,451 చలాన్లు పెండింగ్‌ వున్నాయని. ప్రసుత్తం జరిమానాలు చెల్లించని వాహనాల సంబంధించిన పూర్తి వివరాలు పోలీస్‌ కంప్యూటర్‌ డాటా బెస్‌లో నమోదు కాబడ్డాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. పెండిరగ్‌ ట్రాఫిక్‌ చలాన్లను క్లియర్‌ చేసేందుకుగాను ఇకపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక తనీఖీలు నిర్వహించడం జరుగుతుందని. పోలీసుల తనిఖీ సమయాల్లో పెండిరగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లను వాహనదారులు జమచేయాల్సి వుంటుందని.

ఇకపై ఎవరైన పెండిరగ్‌ చలాన్లు చెల్లించకుండా రోడ్లపై వస్తే ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్ళల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లెట్‌ రికగ్నెషన్‌ కెమెరాల అధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్‌ ట్యాబ్‌లకు సమచారం వెళ్ళడం ద్వారా పోలీసులు మీ వాహనాలను రొడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్‌ చేయడం జరుగుతుందని లేని పక్షంలో వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరిలించడం జరుగుతుందని, కావున వాహనదారులు తమ వాహనాలపై వున్న ట్రాఫిక్‌ జరిమానాలను త్వరితగతంగా చెల్లించాలని పోలీస్‌ కమిషనర్‌ వాహనదారులకు సూచించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!