CPI Raja on BJP: ప్రజాస్వామ్య పరిరక్షణలో కమ్యూనిస్టుల పాత్ర కీలకంగా ఉంటుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. భారతదేశంలో ఓటు చోరీ జరుగుతుందన్నారు. బీజేపీ అధికారం కోసం ఎన్నికల కమీషన్‌ను వాడుకుంటుందని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారాంలోని ఓ గార్డెన్స్‌లో సీపీఐ నాల్గొవ రాష్ట్ర మహాసభలను నిర్వహించింది. ఈ మహాసభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ… మన రాజ్యాంగంలో ప్రజలకు ప్రాథమిక హక్కులో ఓటు ఒక భాగ మన్నారు. ఇలాంటి ఓటును బీజేపీ చకోరీ చేసి దేశ భద్రతను దెబ్బ తీస్తుందన్నారు. పోర్చుగీసు, డచ్చి, బ్రిటీష్ ప్రభుత్వాలు హయాంలో ఓటు హక్కు ఉండేదని గుర్తు చేశారు. కానీ ఆనాడు కేవలం ఆర్ధికం అభివృద్ధి చెందిన, చదువుకున్న వాళ్లకే ఓటు హక్కుకు అవకాశం కల్పించారని తెలిపారు.
Read also- Coolie Beats War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ ను మించి పోయిన రజనీకాంత్ ‘కూలీ’..
అందులో కూడా పురుషులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండేదని వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందుబాటులోకి తీసుకోవచ్చిన రాజ్యాంగంతో దేశంలోని పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడిందన్నారు. 20 ఏళ్లు కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా రాజ్యాంగం రూపొందించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. అయితే ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీ చండ్రప్పన్ పార్లమెంట్లో 18 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్లకు ఓటు హక్కు కల్పించాలని ప్రతిపాదన పెట్టారని గుర్తు చేశారు. ఆ ప్రతిపాదనలకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బలపర్చి అమలులోకి తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఉండే ప్రతి పేద, ధనిక, కుల, మతాలకు అతీతంగా ఆడ, మగ తేడా లేకుండా ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ఇలాంటి ఓటు హక్కును రాజ్యాంగానికి విరుద్దంగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు.
Read also- Coolie A Certificate: సెన్సార్ బోర్డ్‌పై కేసు.. ‘కూలీ’ లాస్ నుంచి బయటపడేందుకు పెద్ద ప్లానే వేశారుగా!
బీహార్ రాష్ట్రంలో లక్షల ఓట్లను తొలగించి సామాన్యులను ఓటుకు దూరం చేస్తుందన్నారు. ఓటు ప్రక్షాళన చేయాలని ఇండియా కూటమీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల కమీషన్ నడుచుకోవాలని డి.రాజా సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కమ్యూనిస్టులుగా మనం ఉద్యమించాలని సూచించారు. మోడి హాఠావో… దేశీకి బచ్చావో అనే నినాదంతో ముందుకుపోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నిజా సర్కార్ కు వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరాటం మాదిరిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సీపీఐ బలంగా ఉందని, మరింత పటిష్టం చేసి ప్రజలకు దగ్గర కావాలని గుర్తు చేశారు. ఈ మహాసభలో సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.