Vice President Election: బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో బాసులు లేరు. కాంగ్రెస్ ఒక చిల్లర పార్టీ, థర్డ్ క్లాస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని విమర్శించారు. బీసీల పై ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి కంచె ఐలయ్యను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పెట్టొచ్చని అన్నారు. రేవంత్ రెడ్డికి బీసీల పై ప్రేమ లేదు. మాకు నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 9 కల్లా ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. తెలంగాణ రైతులకు రెండు లక్షల టన్నుల ఎరువులు ఇస్తామని ఎవరైతే ముందుకు వస్తారో వారికే మా ఓటు కేటీఆర్ అన్నారు.
తెలంగాణ పల్లెల్లో దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయం తప్పా మరోకటి లేదు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. మహిళలు యూరియా దుకాణం దగ్గర పడుకునే పరిస్థితి వచ్చింది యూరియా కోసం రైతులు అధికారుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది.
అగ్రికల్చర్ పైన ఒక్కనాడు ముఖ్యమంత్రి సమీక్ష చెయ్యలేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈరోజు యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది.పోలీసులు రెండే, రెండు పనులు చేస్తున్నారు, ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు, రెండోది యూరియా దుకాణలా దగ్గర కాపలా ఉంటున్నారు. అధికారులను రైతులు కొట్టకుండా పోలీసులు కాపాడుతున్నారు.
వేళ మంది రైతులు వర్షాల్లో తడుస్తూ యూరియా కోసం రైతులు లైన్లో ఉంటుంటే ముఖ్యమంత్రి ఏమో యూరియా కొరత లేదని మాట్లాడుతున్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం నిర్హాకంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటలు బురద రాజకీయాలు చేయడం తప్ప, రైతుల ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి పట్టడం లేదని అన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి కాంగ్రెస్ పార్టీ నాయకులే బ్లాక్ చేస్తున్నట్లు మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుల దందా కోసం యూరియా కొరత చేస్తున్నారు.
54 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి 54 యూరియా బస్తాలు తేలేదు.ఎరువుల కొరత మీద రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడలేదు.
10 యేండ్లలో యూరియా కొరత లేదు , ఈరోజు ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతు బీమా, ఉచిత కరెంట్, రైతు భరోసా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
రైతు ప్రయోజనాల పై బిఆర్ఎస్ ఒక కార్యాచరణకు సిద్ధమవుతుంది. త్వరలోనే పోరాటలకు సిద్ధం అవుతామని అన్నారు. బీఆర్ఎస్ పైన ఒంటికాలు మీద లేసే బిజెపి, యూరియా కొరత పైన మౌనంగా ఉంటుంది. 8మంది బిజెపి ఎంపీలు , 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో తెలంగాణకు గుండు సున్నా. మన రాష్ట్రంలోనే పర్టిలేజర్ ఉత్పత్తి అవుతున్న, యూరియా కొరత ఉండడం సిగ్గుచేటు. రామగుండం పర్టిలేజర్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యూరియా పై ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేవారు.
తెలంగాణ రైతులకు ఇప్పటి వరకు యూరియా ఎంత సరఫరా అయిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలి.
యూరియా కొరత పై వ్యవసాయ కమిషనర్ ను కలుస్తాం. వారం రోజుల పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో రైతులకు అండగా ఉండి నిరసన కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు.