NTR Birth day
సూపర్ ఎక్స్‌క్లూజివ్

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy name:
ఒక తరానికి ఆయన ఆరాధ్య పురుషుడు. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, పౌరాణిక పాత్రల కోసమే పుట్టాడా అనిపించే యశస్సు కలిగిన నందమూరి తారక రామారావు 1982 తర్వాత ఓ సరికొత్త రాజకీయ ప్రభంజనంగా మారారు. అప్పటిదాకా గుర్తింపుకు నోచుకోని తెలుగువారికి ఓ ఆత్మగౌరవ నినాదం అయ్యారు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన తొలి ముఖ్యమంత్రి ఆయనే. ఆకలితో అలమటించే అన్నార్తులకు ఎన్టీఆర్ కిలో 2 రూపాయల బియ్యం పథకం పట్టెడు అన్నం పెట్టింది. లక్షలాది పేదల కడుపు నింపిన నేత గా తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేశారు. నేడు 101వ జయంతి.


ఆత్మగౌరవ నినాదంతో..

1982 సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి టీ.అంజయ్య పట్ల చూపిన అగౌరవ సంఘటన ఎన్టీఆర్ పై తీవ్ర ప్రభావమే చూపింది. ఒక రకంగా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ప్రేరణగా నిలిచింది. అందుకే తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారు. అంతేకాదు పార్టీ నెలకొల్పిన తొమ్మిది నెలలోనే అధికార పీఠాన్ని దక్కించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడారు. నాటి ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.


సినిమా టూ పాలిటిక్స్

ఎన్టీఆర్ పార్టీని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ నాయకులు లైట్ తీసుకున్నారు. అతను సీరియస్ పొలిటిషయన్ కాదని కొట్టిపారేశారు. రానురానూ ఎన్టీఆర్ ప్రత్యర్థుల మాటలు తప్పని నిరూపించారు. చైతన్య రథం ద్వారా ప్రజల్లోకి వెళ్లి, అప్పటిదాకా తనకున్న సినిమా ఇమేజ్‌ను పొలిటికల్ ఇమేజ్‌గా మార్చుకోవడంలో విజయవంతం అయ్యారు. రోడ్డుపక్కనే స్నానాలు చేయడం, భోజనం చేయడం, రోడ్డుపైనే నిద్రపోవడం లాంటివి ఎన్టీఆర్‌ను మాస్ లీడర్ చేశాయి. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది.

రెండుసార్లు వెన్నుపోటు

13 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్టీఆర్ ఎన్నో ఒడిదుడుకులు, కష్టసుఖాలు చవిచూశారు. తొలి సారి అధికారంలకి వచ్చిన 18 నెలలోనే 1984లో తన సహచర రాజకీయ మిత్రుడు నాదెండ్ల భాస్కర్ రావు నుంచి వెన్నుపోటును ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లగా, అప్పటి గవర్నర్ రాంలాల్ మద్దతుతో నాదెండ్ల భాస్కర్ రావు సీఎం కుర్చీ ఎక్కారు.చికిత్స పూర్తయ్యాక ఎన్టీఆర్ తిరిగి వచ్చాక, మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వడంతో భాస్కర్ రావు ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగి మళ్లీ 1985లో అధికారంలోకి వచ్చారు. 1995లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రాబాబు నాయుడు రూపంలో మరోసారి వెన్నుపోటుకు గురయ్యారు. ఫలితంగా దేశంలోనే రెండుసార్లు వెన్నుపోటుకు గురైనా ఏకైక సీఎంగా ఎన్టీఆర్ నిలిచారు.

సంక్షేమ పథకాల సారధి

ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యాక రూ.2 కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చారు. మధ్యపాన నిషేదం లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1985-89 మధ్య సీఎంగా పనిచేసిన సమయంలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం విశేషం. అయితే వాటిలో కొన్ని వివాదాస్పదం అయ్యాయి. పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలనుంచి 55 కు కుదించడం, కరణాల వ్యవస్థ రద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలు 1989 ఎన్నికలలో ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోవడానికి కారణం అయ్యాయి. ఏది ఏమైనా సినిమాలలో ఇటు రాజకీయాలలోనూ ఒక వెలుగు వెలిగిన జన నేత ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!