Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి జయకృష్ణ భార్య శ్రీమతి పద్మజ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. శ్రీమతి పద్మజ, నందమూరి తారక రామా రావు , శ్రీమతి బసవరామ తారకం పెద్ద కోడలు . జయ కృష్ణ భార్య, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సోదరి కూడా. గత కొంత కాలం నుంచి పద్మజ ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఎదురు కావడం తో ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్ లో చేర్పించారు. అయితే, తెల్లవారు జామున ఆమె మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ వార్తతో నందమూరి కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వార్త తెలిసి విజయవాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు , ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బయలుదేరారని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు.
