Mahatma Gandhi NREGA Scheme (imagecredit:swetcha)
తెలంగాణ

Mahatma Gandhi NREGA Scheme: గుడ్ న్యూస్.. మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్ప‌న ప‌నులు?

Mahatma Gandhi NREGA Scheme: పల్లెల్లో పనుల జాతరను ఈ ఏడాది(2025-26 ) రూ.4వేలకోట్లతో చేపట్టనున్నారు. అందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వారంలోకా పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్ని పనిదినాలు చేపట్టాలి? ఏయే పనులు చేయాలనేదానిపై ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదికను సైతం అందజేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇందిరా మహిళా శక్తి మహిళలకు ఉపాధి కల్పన పనులు చేపట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు.

వ‌ర్షాలు తగ్గుముఖం

తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో ‘పనుల జాతర’ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. గతేడాది నిర్వహించిన పనుల జాతర విజ‌య‌వంతం కావ‌డంతో, ఈ ఏడాది చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క సైతం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి, పల్లె ప్రగతికి ఈ పనుల జాతర కీలకంగా మారింది. ఉపాధి హామీ పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక పనులు ఏకకాలంలో చేపట్టారు. వ‌ర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఈ వారంలోనే పనుల జాతర ప్రారంభించేందుకు అధికారులు కార్య‌చ‌ర‌ణ‌ సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో నిర్వహించిన పనుల జాతర అంచనాలకు మించి విజయవంతం కావడంతో పాటు, లక్ష్యాలకు అనుగుణంగా నిధుల వినియోగం జరిగింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమైందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం

గ‌త ఏడాది ప్రజలకు ప‌నుల జాతర‌లో భాగంగా చేప‌ట్టిన ఉపాధి హామీ ప‌నులతో మొత్తం 12.23 కోట్ల ప‌నిదినాలు క‌ల్పించారు. అభివృద్ది ప‌నుల కోసం రూ.4529.07కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇందులో వేతనాల వ్య‌యం రూ.2614.3 కోట్లు కాగా మెటీరియల్ వ్యయం రూ.1685.52 కోట్లు, అడ్మినిస్ట్రేటివ్ వ్యయం రూ.229.25 కోట్లు ఖ‌ర్చు చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రైతుల‌కు వ్యక్తిగత లబ్ధిదారుల ఆస్తుల కల్పన కింద 12,247 ప‌శువుల షెడ్లు, 500 పౌల్ట్రీ షెడ్లు, మేకలు, గొర్రెల షెడ్లు -1,551, వర్మి కంపోస్ట్ యూనిట్లు – 1,187, ఫారం పౌండ్ పనులు- 5,026 పూర్తి చేశారు. అంతేకాదు పాఠశాల్లో మౌలిక సదుపాయాలు క‌ల్పించారు. పాఠశాల్లో టాయిలెట్లు- 5,827, పాఠశాలలకు ప్ర‌హ‌రీలు- 3,366, కిచెన్ షెడ్లు – 2,401 నిర్మాణాల‌ను చేప‌ట్టారు. మరోవైపు 12,010 వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం, 2,598 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేప‌ట్టారు. నీటి నిల్వలను పెంచడంలో భాగంగా 1,224 రూఫ్‌టాప్ హార్వెస్టింగ్‌ నిర్మాణాలు, 127 బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, 154 చెక్‌డ్యాంలు, 2,811 పెర్కొలేషన్ ట్యాంక్ పనులు చేప‌ట్టారు.

Also Read: Tollywood Actor: బరితెగించిన హీరో.. డైరెక్టర్ చెప్పాడని.. రోడ్డుపై ప్యాంట్ తీసేసి..!

కేంద్రం పనిదినాలు పెంచితే

ఈ ఏడాది 2025-26 ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 6.5కోట్ల పనిదినాలను ఉపాధిహామీ పథకం కింద చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. 4వేలకోట్ల రూపాయలతో పనులు చేపట్టబోతున్నారు. పనిదినాలను పెంచాలని ఇప్పటికే మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేంద్రం పనిదినాలు పెంచితే అందుకు సంబంధించి నిధుల కేటాయింపులు సైతం పెరిగే అవకాశం ఉంది. కేంద్రంపైనే రాష్ట్రం ఆశలుపెట్టుకుంది. అయితే గతేడాదికంటే ఈ సారి వ్యవసాయ అనుబంధ రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పనుల్లో వేగం సైతం పెంచబోతున్నారు.

ఇందిరా మహిళాశక్తికి ‘ఉపాధి’

గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్లె పనుల జాతరతో ఈసారి ఇందిరా మహిళాశక్తి మహిళలకు ఉపాధి కల్పన పనులు కల్పించబోతున్నారు. ఇప్పటికే మహిళలను అన్ని రంగాల్లో అబివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది. కోటిమహిళలను కోటిశ్వరులను చేస్తామని ప్రకటించిన విధంగానే అందుకు అనుగుణంగా పథకాలను సైతం రూపొందిస్తూ ముందుకు సాగుతుంది. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులు, పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు రుణాలు ఇస్తూ ఆర్థిక బలోపేతంకోసం కృషిచేస్తుంది. ఈ పనుల జాతరలో వ్య‌వ‌సాయ పొలాల‌కు బాట‌ల నిర్మాణం, ఫ‌ల వ‌నాలు, జ‌ల నిధి కింద నీటి సంర‌క్ష‌ణ‌, భూ గ‌ర్భ జ‌లాలు పెంచే ప‌నులు, ఇంకుడు గుంత‌ల నిర్మాణం, గ్రామీణ మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, జీపీ, అంగ‌న్వాడీ భ‌వ‌నాలు, సీసీ రోడ్ల నిర్మాణం, పాఠ‌శాల‌ల్లో టాయిలెట్ల నిర్మాణం వంటి ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు.

పల్లెల్లో ఉపాధి కల్పన: మంత్రి సీతక్క

ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే విధంగా పనుల జాతరను మరింత విస్తృతంగా నిర్వహిస్తాం. పల్లెల్లో ఉపాధి కల్పనతో పాటు, గ్రామీణ అభివృద్ధి పునాది బలపడేలా పనుల జాత‌ర ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఈ పనుల్లో వ్యవసాయరంగానికి సంబంధించిన పనులకు తొలి ప్రాధాన్య ఇస్తున్నాం. ఈ పనుల జాతరలో తొలిసారి ఇందిరా మహిళా శక్తి మహిళలకు ఉపాధి కల్పించబోతున్నాం. వారిని ఆర్థికంగా బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం.

Also Read: Murugadoss controversy: వివాదాల్లో చిక్కుకున్న తమిళ దర్శకుడు.. వాళ్లేనా అలా మాట్లాడే‌ది

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు