CPI Mahasabha (imagecredit:swetcha)
తెలంగాణ

CPI Mahasabha: ఈ నెల 20 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు: కూనంనేని సాంబశివరావు

CPI Mahasabha: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) తెలిపారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనూ మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న సీపీఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 20న ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 743 ప్రతి నిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కలుపుకుని 1000 మంది పాల్గొనున్నారని తెలిపారు. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ నుంచి మహాసభల వేదిక వరకు రెడ్‌ ప్లాగ్‌ మార్చ్(Red Plague March) ఉంటుందని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి అరుణ పతాకాన్ని, నవ చేతన పబ్లిషింగ్‌ హౌజ్‌ సంపాదకుడు ఏటుకూరి ప్రసాద్‌ మృతవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. మహాసభలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మహాసభలను ప్రారంభిస్తారన్నారన్నారు. మహాసభల ప్రాంతానికి పొట్లూరి నాగేశ్వరరావునగర్‌ గా నామకరణం చేశామన్నారు.

దేశ ప్రజలను చీల్చిందుకు కుట్ర

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగట్టేందుకు మహాసభల వేదికగా ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోనున్నామని వెల్లడించారు. మతోన్మాద పార్టీ అయిన బీజేపీ ఫాసిస్టు విధానాలను అనుసరిస్తూ మతం, కులం, జాతి, భాషా పేర్లతో చిచ్చు పెడుతూ దేశ ప్రజలను చీల్చిందుకు కుట్ర పనుతోందని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ(BJP)ని 240 సీట్లకు కట్టడి చేసి కొంత నియంత్రించగలిగామని, భావసారుప్యత గల పార్టీలతో కలిసి భవిష్యత్‌లో బీజేపీని రాజకీయంగా మరింత కట్టడి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Atal Canteen: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఇక రూ.5కే ఆహారం.. రూ.100 కోట్లు కేటాయింపు!

స్థానిక సంస్థల ఎన్నికలకు

రాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభుత్వంప్రభుత్వరంగ సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీపీఐ, సీపీఎంతో పొత్తు ఉంటుందని, అదేవిధంగా కాంగ్రెస్‌తోనే స్నేహబంధం కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి(Chada Venkat Reddy), పశ్యపద్మ, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వీ.ఎస్‌.బోస్‌, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ సాయిల్‌ గౌడ్‌, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు యూసుప్‌, ప్రధాన కార్యదర్శి, ఉమామహేశ్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌, కౌన్సిల్‌ సభ్యుడు దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: ప్రజలకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచ‌న‌లు?

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?