CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ

CM Revanth Reddy: తెలంగాణలోనూ ఓట్ల చోరికి కుట్ర.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. సీఎం వార్నింగ్!

CM Revanth Reddy: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్​ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో (Bharat Jodo Yatra) యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘5 నెలలు గడిచినా అమోదించలేదు’
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో తాము చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం. విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ (KCR) చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది. అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. 5 నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశాం. బహుజనుల కోసం బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ధర్నాకు ఎందుకు రాలేదు’ అని రేవంత్ ప్రశ్నించారు.

‘బీసీలకు అన్యాయం చేస్తున్నారు’
తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా? అని సీఎం ప్రశ్నించారు. ‘ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు? నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించగలరా? 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపండి. ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత. సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి. విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు. విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదని వారి స్ఫూర్తిని రగిలించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Also Read: Poll Body Boss: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బిగ్ షాక్.. అభిశంసన దిశగా విపక్షాల అడుగులు!

ఓట్ల గోల్ మాల్‌‌పై..
దేశంలో ఓట్ల చోరి జరిగిందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ సమర్థించారు. ‘మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. బీహార్ లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి.. తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయం. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు ఇక్కడ కూడా ఓట్లు చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం’ అని సీఎం పిలుపునిచ్చారు.

Also Read This: Putin Bodyguards: స్పెషల్ బ్రీఫ్ కేసులో పుతిన్ మలం.. భద్రంగా తీసుకెళ్లిన బాడీగార్డ్స్.. ఎందుకంటే?

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?