Shambipur Raju mlc, brs
Top Stories, క్రైమ్

Hyderabad:సొంతవాళ్ల ఫోన్లే ట్యాప్! 

  • కేసీఆర్‌తో నిత్యం శభాష్ అనిపించుకునే
  • శంబీపూర్ రాజు ఫోన్ ట్యాపింగ్ బాధితుడే
  • స్థానికంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారని నిఘా
  • ఇంట్లో మనిషి అంటూనే అంతా పసిగట్టారా?
  • ఎమ్మెల్యేల ఒత్తిడితో సొంత పార్టీ నేతలనూ వదలలేదా?
  • విశ్వసనీయతకు మారుపేరులా ఉండే శంబీపూర్‌నే నమ్మలేదా?
  • ఇలా లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారు?

దేవేందర్ రెడ్డి, 9848070809   

Phone tapping case brs own party leaders also victims  Shambipur raju:

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. అలా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు తేలింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉండి, ఆయన కుటుంబంలో సొంతింటి మనిషిలా పేరు తెచ్చుకున్నాడు శంబీపూర్ రాజు. తెలంగాణ అంటే తరిమికొట్టే రోజుల్లో స్థానికంగా టీఆర్ఎస్ జెండాను ఎత్తుకున్నారు. తెలంగాణ వచ్చేంత వరకు గణేష్ నిమజ్జనం చేయబోనని ఏడాది పాటు దీక్ష బూనిన ఉద్యమ కారుడు ఈయన. అంచెలంచెలుగా పార్టీలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో కీలకంగా వ్యవహరించారనే పేరుంది. స్థానికంగా పార్టీ నేతలపై పట్టు సాధించారు. అయితే, లోకల్ ఎమ్మెల్యేతో శంబీపూర్ రాజుకు పొసగడం లేదనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనపై నిఘా పెంచింది బీఆర్ఎస్ పార్టీ. ఆర్థికంగా ఎలా ఎదిగారని ఆరా తీసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ఉద్దేశంతో ఫోన్స్ ట్యాప్ చేయడం మొదలు పెట్టింది అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం. ఏ నిమిషం ఏం చేస్తున్నారో అప్టేట్ తెలుసుకుంది. వాట్సాప్ చాట్ నుంచి ఫేస్ టైం కాల్స్ వరకు ఏం జరిగేదో తెలుసుకుంది. అందుకు కొత్త కొత్త టూల్స్ కొనుగోలు చేశామని నిందితులు విచారణలో తెలిపారు. ఫోన్‌లో ఏం జరిగినా నివేదిక ఇంటెలిజెన్స్ చీఫ్‌కి వెళ్లేది. అక్కడి నుంచి ఎక్కడకి వెళ్లేది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎమ్మెల్యే ఒత్తిడి పనిచేసిందా?

బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇదంతా ఎందుకు చేశారో పోలీసుల విచారణలో నిందితులు పటాపంచలు చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన వివేకానంద గౌడ్‌కు వ్యతిరేకంగా శంబీపూర్ రాజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఉద్దేశంతో నిఘా పెట్టామని ఓ అడిషనల్ ఎస్పీ తన కన్ఫెషన్ రిపోర్టులో పోలీసుల ముందు ఒప్పుకున్నారు. శంబీపూర్ రాజు ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా, వివిధ యాప్స్ ద్వారా చాటింగ్ చేసినా క్షణాల్లో తెలుసుకునే వారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ తప్పినా హై కమాండ్ నుంచి ఫోన్స్ వచ్చి హెచ్చరికలు జారీ చేసేవారు. అప్పట్లో అర్ధం కాని వీరంతా, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం బయటకు రావడం, ఉన్నతాధికారులు స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు విషయాలు బట్టబయలు అవుతున్నాయి. ఇలా పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసినా, కొంత మంది లీడర్స్ ఒత్తిళ్లతో సొంత ఇంటి మనుషులను కూడా టార్గెట్ చేశారు. మధ్యలో వేరే పార్టీ నుంచి వచ్చి ఇబ్బందులు పెట్టిన తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్స్ ట్యాప్ చేస్తూనే ఉన్నారు. అవకాశం ఉందని అందరి జీవితాల్లో తొంగిచూశారు. అధికారులు ఆ పార్టీకి మాత్రమే గూఢచారి వ్యవస్థలుగా పనిచేశారు. అందుకే, ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!