Udaya Bhanu (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Udaya Bhanu: వాళ్ళకి త్వరలో నేనేంటో చూపిస్తా.. గుట్టు మొత్తం బయట పెడతా.. ఉదయభాను

Udaya Bhanu: ఒకప్పుడు యాంకర్‌గా తనదైన గుర్తింపు సంపాదించి, ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రలు, ఐటెం సాంగ్స్‌తో ఇండస్ట్రీలో సందడి చేసిన ఉదయభాను, ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైంది. అంతక ముందు షోలతో బిజీగా గడిపిన ఆమె, ఆ తర్వాత అవకాశాల కొరతతో అనేక ఇబ్బందులు పడింది.

ఇప్పుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న త్రిబాణదారి బార్బరిక్ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తూ, ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టింది. త్రిబాణదారి బార్బరిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. “ఇండస్ట్రీలో సిండికేట్ ఉంది. అందరూ నన్ను కావాలనే తొక్కేశారు. ఒక ఈవెంట్‌లో జోక్‌గా చెప్పాను, కానీ అదే నిజం నేనెప్పుడు నిజాలే మాట్లాడతా.. ” అంటూ ఆమె చాలా ఎమోషనల్ అవుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

” నాకు అవకాశాలు రాలేదని కాదు, ఎన్నో వచ్చాయి. కానీ కొంతమంది ఆ ఆఫర్లను కావాలనే నా నుంచి లాగేసుకున్నారు. ఈవెంట్‌కు రెడీ అయి వెళ్లే సమయానికి ఫోన్ వచ్చి, ‘సారీ, ఏం అనుకోకండి.. మిమ్మల్ని తీసేశాం, వేరే వాళ్లను పెట్టాం’ అని చెప్పేవారు. ఇలాంటి అనుభవాలు నేను చాలా చాలా ఎదుర్కొన్నా,” అని ఆమె వాపోయింది. ఆమె మాటల్లో కోపం స్పష్టంగా తెలుస్తుంది. “కొంతమంది యాంకర్లు నన్ను కావాలనే అడ్డుకున్నారు. నేను ఎదిగితే వాళ్లకు అవకాశాలు రావని వెనుక నుంచి ఇలాంటి పని చేశారు. ఈ సిండికేట్‌ను త్వరలో బట్టబయలు చేస్తా.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్లకు అసలేం జరుగుతుందో అన్ని నిజాలు తెలియాలి. అందుకే నేను మళ్లీ వచ్చాను,” అని ఉదయభాను చెప్పింది.

ఆమె మరో ఆసక్తికర విషయాన్ని కూడా ఫ్యాన్స్ తో పంచుకుంది. “చిన్న చిన్న షోలకు అవకాశాలు వచ్చినా, నా వల్ల ఇతర చిన్న యాంకర్లకు ఇబ్బంది కలగకూడదని నేనే వాటిని రిజెక్ట్ చేశాను ” అని చెప్పి, తన సహృదయతను చాటుకుంది. ఉదయభాను వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె రీ-ఎంట్రీతో ఏం జరగబోతోందో చూడాలి.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?