Collectorate: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో (Vikarabad District Collectorate) విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కన్ను మిన్ను ఎరుగక, అభము శుభము తెలియని ఓ చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న పరిగి నియోజకవర్గానికి చెందిన నరేందర్ (45) (Narendar) అనే కామాంధుడు అప్పటికే మద్యం సేవించి ఫుట్ పాత్‌పై నిల్చున్నాడు. శనివారం గోకులాష్టమి (Gokulashtami) పండగను పురస్కరించుకుని పాఠశాలలకు ప్రభుత్వ సెలవు ఉండడంతో.. సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయం ముందున్న కాలనీ చిన్నారులు ఆ కార్యాలయం ఆవరణలో ఆడుకోవడానికి వెళ్లారు. ఆడుకుంటున్న చిన్నారులను కాసేపు పరిశీలించి వారిలో ఒక చిన్నారితో మాయ మాటలు చెప్పి దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.
Also Read- King Nagarjuna: తనతో సినిమా చేయమని దర్శకుడి వెంట పడ్డ కింగ్..? ఆ తోపు దర్శకుడు ఎవరంటే?
కామాంధుడి చేష్టలకు వణికిపోయిన ఆ చిన్నారులు అక్కడి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లిదండ్రులకు వద్దకు వచ్చి జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ విషయమై వెంటనే స్పందించిన తల్లిదండ్రులు కామాంధుని పట్టుకోవడానికి కలెక్టర్ కార్యాలయంలోకి పరిగెత్తడంతో నిందితుడు పొదల చాటున దాక్కున్నాడు. అప్పటికే కాలనీవాసులు పలువురు అక్కడికి చేరుకోవడం ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించడంతో పొదల మాటున దాక్కున్న నిందితుడు నరేందర్‌ని పట్టుకొని కలెక్టరేట్ కార్యాలయం గేటు బయట దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు ఆ చిన్నారుల తల్లిదండ్రులు వికారాబాద్ పోలీస్ స్టేషన్ (Vikarabad Police Station) కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన సిఐ భీమ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్ర జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ ఉద్యోగి ఘటన మరవకముందే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఇటు ప్రజలలో కలెక్టరేట్ కార్యాలయం పనితీరు ఈ విధంగా తయారైందని సర్వత్రా చర్చగా మారింది. ఇదిలా ఉంటే, కొంతమంది ఉద్యోగులు సైతం మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు, సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు సైతం కలెక్టరేట్ కార్యాలయం పై సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకొని కలెక్టరేట్ కార్యాలయం పనితీరు మసకబారక ముందే చక్కదిద్దితే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి పనులు ఎవరు చేయాలన్నా వణికిపోయేలా.. చట్టలు ఉండాలని, అలా ఉంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేలా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు