Warangal
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Warangal: వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి కీలక ఆదేశాలు

Warangal: నగరం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి

వరద నీటి తీవ్రత స్థాయి అంచనా వేసి సమన్వయంతో పనిచేయాలి
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి శశాంక్ ఆదేశాలు
భద్రకాళి బండ్, చిన్న వడ్డేపల్లి చెరువు, ఐసీసీసీ కేంద్రాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన

వరంగల్, స్వేచ్ఛ: వరంగల్ నగరం (Warangal) ముంపునకు గురికాకుండా ప్రణాళిక ప్రకారం, శాశ్వత చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి ఆయన భద్రకాళి బండ్, చిన్న వడ్డేపల్లి చెరువు, ఐసీసీసీ కేంద్రాల్లో క్షేత్ర స్థాయి పర్యటించి పరిశీలించారు. సమర్థవంతంగా వరద ముంపును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

భద్రకాళి చెరువు సమీపంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, తదితర లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీకి సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి 12 మోరీల వద్ద వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం చిన్న వడ్డపల్లి చెరువును పరిశీలించి కట్ట మల్లన్న చెరువు నుంచి వచ్చే వరదతో ముంపునకు గురయ్యే సమీప ప్రాంతాలు ఎస్‌ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, ప్రజలను సురక్షితంగా పునరావస కేంద్రాలకు తరలించడం, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Read Also- Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?

నగరంలో వరద తీవ్రత స్థాయి అంచనా తగ్గట్టుగా వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారి శశాంక్ సూచించారు. వరదనీటి తీవ్రత, స్థాయిని అంచనా వేయాల్సిన అవసరం ఉందని, నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా భద్రకాళీ బండ్ ఇన్‌లెట్ వద్ద వాస్తవ సామర్థ్యం ఎంత?, ఎంత ఇన్‌ఫ్లో వస్తోంది?, ఎంత ఔట్ ఫ్లో వెళుతుంది?, లెవెల్స్ ఇంత కచ్చితంగా ఉన్నప్పటికీ ఔట్ ఫ్లో అవుతోంది? వంటి విషయాల అధ్యయనానికి ఇరిగేషన్, బల్దియా, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, సక్రమంగా లెవెల్స్ , సామర్థ్యాన్ని నిర్వహిస్తూ ఇన్ ఫ్,లో ఔట్ ఫ్లోకు అనుగుణంగా భద్రకాళి నిలువ సామర్థ్యాన్ని పెంచి వరద ముంపుకు గురికాకుండా నీటిని నిలువరించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

Read Also- Rajiv Yuva Vikasam: నిరుద్యోగ యువతకు ‘రాజీవ్ యువవికాసం’ అమలు అప్పుడేనా!

గ్రీన్ ఏరియాలోకి నీరు చేరకుండా చూడడంతో పాటు లోతట్టు ప్రాంతాలకు వరద ప్రభావితం కాకుండా చూడాలని, వరద ప్రవహించే గరిష్ఠ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైన్ నిర్మాణాలు చేపట్టాలని శశాంక్ సూచించారు. చిన్న వడ్డేపల్లి ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో మాట్లాడుతూ, భారీ వర్షాలు కురిసే క్రమంలో కట్టమల్లన్న చెరువు నుంచి చిన్న వడ్డేపల్లి చెరువుకు నీరు చేరే క్రమంలో మధ్యలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రధాన డ్రైన్‌లు, స్ట్రాం వాటర్ డ్రైన్‌లు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు మునిగి పోతున్నాయని అన్నారు. అంతే కాకుండా, ఇన్ ఫ్లో వచ్చినప్పుడు గేట్ లెవెల్స్ నిర్వహణ చేస్తూ వంద అడుగుల రోడ్‌లో ఉన్న ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అధిక సామర్థ్యంతో మేజర్ (పెద్ద) డ్రైన్స్ నిర్మిస్తే సహజ ప్రవాహం ఎప్పటికపుడు వెళ్లిపోయే అవకాశం ఉందని అన్నారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని ప్రతి చెరువుకు సంబంధించి నీటి ప్రవాహం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోకు సమాచారం ప్రతివార్డును ఎప్పటికపుడు అప్రమత్తం చేయాలన్నారు. ఇందుకోసం సమాచారం చేరేలా ఐసీసీసీకి అనుసంధానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఏంహెచ్‌వో డా.రాజారెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఈ, సిటీ ప్లానర్స్ మహేందర్, రవీందర్ రాడేకర్, ఏంహెచ్‌వో డా.రాజేష్, ఈఈ రవికుమార్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, శానిటరీ సూపర్ వైజర్ భాస్కర్ గోల్కొండ, శ్రీను పాల్గొన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?