Singareni development
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana:బొగ్గుబాయి బతుకులు బుగ్గిపాలు

  • బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల బతుకులు అధ్వానం
  • పదేళ్ల కేసీఆర్ పాలనలో తగ్గుతూ వచ్చిన కార్మికులు
  • లక్షకు పైగా కార్మికుల సంఖ్య 40 వేలకు చేరుకున్న వైనం
  • సంస్థ లాభాలలో ఉన్నా…కార్మికుల సంఖ్య తగ్గించేసిన బీఆర్ఎస్ నేతలు
  • సింగరేణి విస్తరణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్
  • రూ.5,900 కోట్ల అంచనా వ్యయంతో జైపర్ వవర్ ప్లాంట్ విస్తరణ
  • ఇల్లెందు పంప్డ్​ స్టోరేజ్‌‌‌‌ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఏర్పాటుకు సిద్ధం
  • విండ్‌‌‌‌ పవర్‌ ఏర్పాటు దిశగా అడుగులు
  • న్నికల కోడ్ అవ్వగానే సింగరేణి విస్తరణకు కాంగ్రెస్ సన్నాహాలు

Congress sarkar plan to development and extention of Singareni organisation:


తెలంగాణ సిరుల గని సింగరేణిలో ఒకప్పుడు లక్షకు పైగా కార్మికులు పనిచేసేవారు. అలాంటిది సింగరేణిలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. రాష్ట్రంలో సింగరేణి పరిధి వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కార్మికుల సంఖ్య దాదాపు 40 వేలకు పడిపోయింది. బీఆర్ఎస్ హయాంలో గడచిన 5 సంవత్సరాలలో బాగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా నియామకాలు చేపట్టకపోగా..కార్మికుల సంక్షేమ పథకాలన్నీ అటకెక్కించేశారు. దీనితో ఉన్న కార్మికులే వేరే ఉద్యోగాలు వెదుక్కునే పరిస్థితి కల్పించారు బీఆర్ఎస్ నేతలు. దీనితో ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వచ్చింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల పరిధిలో ఐదేళ్ల క్రితం సుమారు 21 వేల మంది ఉన్న కార్మికులు ప్రస్తుతం 14 వేలకు చేరారు. అయితే తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి విస్తరణపై దృష్టి పెట్టింది. కాస్ట్‌‌‌‌లో పంప్డ్​స్టోరేజీ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌తో పాటు సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ మట్టి గుట్టలపై విండ్‌‌‌‌ పవర్‌‌‌‌ ఉత్పత్తి చేసేందుకు ఫోకస్‌‌‌‌ చేసింది. ఈ విషయాలపై సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్‌‌‌‌ ఇచ్చారు. పార్లమెంట్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌ అనంతరం ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

విస్తరణ దిశగా అడుగులు


దాదాపు ఆరు జిల్లాలలో విస్తరించిన సింగరేణి సంస్థ మొదట్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాపైనే ఫోకస్ పెట్టింది. 2016లో జైపూర్ ప్లాంట్ లో రెండు యూనిట్ల ద్వారా 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. తర్వాత మొదటి దశలో తొమ్మిది ప్రాంతాలలో 13 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 235 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. రెండో దశలో భాగంగా 232 మెగావాట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మందమర్రిలో 67.5 మెగావాట్ల ప్లాంట్, రామగుండం పరిధిలోని ఓవర్ బర్డెన్ డంప్ లో 37 మెగావాట్ల ప్లాంట్, శ్రీరాంపూర్ ప్రాంతంలో 27.5 మెగావాట్ల ప్లాంట్, కొత్తగూడెంలో 32.5 మెగావాట్ల ప్లాంట్, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ సెంటర్ ఆవరణలో 32.5 మెగావాట్ల ప్లాంట్, ఇల్లందులో 37.5 మెగావాట్ల ప్లాంట్ ను నిర్మాణం చేయనున్నారు. ఇక జైపర్ వవర్ ప్లాంట్ ను విస్తరించడంలో భాగంగా రెండో దశలో 800 మెగావాట్ల మూడవ యూనిట్ ను నిర్మించేందుకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ప్లాంట్ ఆవరణలోనే రూ.5,900 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు.

నియామకాలను నిలిపివేసిన బీఆర్ఎస్

సంస్థ ఉత్పత్తి పెరిగినప్పటికీ కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్న నెపంతో బీఆర్ఎస్ సూచనల ప్రకారం సంస్థ యాజమాన్యం కార్మికులను తగ్గించే పన్నాగం పన్నింది. గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌ పథకాన్ని తెరపైకి తేవడం ద్వారా సర్వీసు మిగిలి ఉండగానే కార్మికులను ముందస్తుగా ఉద్యోగాల్లో నుంచి తొలగించే ప్రక్రియకు నాంది పలికింది. అలా ప్రారంభమైన కార్మికుల ఏరివేత కారణంగా సింగరేణి వ్యాప్తంగా వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి యాజమాన్యం చూపుతున్న శ్రద్ధ సంస్థ మనుగడపై చూపడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అండర్‌ గ్రౌండ్‌ గనులను క్రమంగా మూసి వేస్తున్న యాజమాన్యం, వాటి స్థానంలో ఓపెన్‌కాస్టు గనులను తెరపైకి తెచ్చింది. . రామకృష్ణాపూర్‌ ఓసీ మూతవేతకు సిద్ధంగా ఉండగా, దాని జీవితకాలం పెంచే అవకాశంపై బీఆర్ఎస్ ఏనాడూ దృష్టి సారించలేదు. ఆర్కే ఓసీ వద్ద షాఫ్ట్‌బ్లాక్‌ మైన్‌ ప్రారంభిస్తే జీవితకాలం పెరిగి ఉద్యోగావకాశాలు మెరుగుపడే అవకాశాలున్నాయి అయినప్పటికీ బీఆర్ఎస్ వీటిపై ఏనాడూ ఫోకస్ పెట్టలేదు.

సింగరేణికి కాంగ్రెస్ చేయూత

స్థిరమైన ఇంధన వనరులను వినియోగించుకొని ముందుకు సాగాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు సింగరేణి సంస్థ కార్యాచరణను రూపొందించుకుంది. ఇందులో భాగంగా ఇల్లందు సమీపంలోని జేకే ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ వద్ద అనుకూలంగా ఉండడంతో పంప్డ్​స్టోరేజ్‌‌‌‌ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఏర్పాటుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రెడీ చేసింది. కింది ప్రాంతంలో డ్యామ్‌‌‌‌ను నిర్మించి అందులో స్టోర్‌‌‌‌ అయిన నీటిని పంప్‌‌‌‌ల ద్వారా ఎత్తైన ప్రాంతానికి పంపించి తిరిగి కిందకు తీసుకువస్తూ టర్బైన్లను తిప్పడం వల్ల పవర్‌‌‌‌ జనరేట్‌‌‌‌ అవుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇలా పంప్డ్‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను నెలకొల్పడానికి సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇదే విషయంపై సంస్థ ఉన్నతాధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక సైతం అందజేశారు.‌‌‌ రాష్ట్రంలో విండ్‌‌‌‌ పవర్‌‌‌‌ (పవన విద్యుత్) ఉత్పత్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు వైపు కూడా అడుగులు వేసేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ల వద్ద బొగ్గు వెలికితీత కోసం తవ్వి తీసిన మట్టి గుట్టలపై విండ్‌‌‌‌ పవర్‌‌‌‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చని సింగరేణి సంస్థ భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలుసైతం రెడీ చేసుకుంది. ఎన్నికల కోడ్‌‌‌‌ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్‌‌‌‌ తీసుకుని విస్తరణ దిశగా అడుగులు వేసేందుకు సంస్థ ఎదురుచూస్తోంది.

Just In

01

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!