Roads Damage: కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) పరిధిలోని గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయి. 124 ప్రాంతాల్లో సుమారు 84.97 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రూ.147.70 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పీఆర్(PR), ఆర్డీ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. 48 ప్రాంతాల్లో ఉపరితల రోడ్లు దెబ్బతినగా.. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.3.32 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం రూ.42.63 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కల్వర్టులు, కాజ్ వేలు, క్రాస్ డ్రెయిన్ పనులు మొత్తం 77 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక పనుల కోసం రూ.1.55 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.57.60 కోట్లు అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అదేవిధంగా 30 ప్రాంతాల్లో గండ్లు పడగా తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.కోటికి పైగా, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.5.45 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
పనుల కోసం రూ.141.68 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో 124 చోట్ల పీఆర్(PR), ఆర్డీ రోడ్లు(RD Roads) దెబ్బతినగా.. తాత్కాలిక పునరుద్ధరణ రూ.6.02 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం రూ.141.68 కోట్లు అవుతాయి. మొత్తం దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు తాత్కాలిక, శాశ్వత పనుల కోసం రూ.147.70 కోట్లు ఖర్చు అవుతాయని అధికారుల అంచనా వేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సెక్రటరీలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి అక్కడి నుంచి ప్రజలను తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
Also Read: Hanamkonda News: ఉత్తర తెలంగాణలో గొల్ల కురుమల సాంస్కృతిక సమ్మేళనం!
ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
ఫ్లడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలకు సహాయం అందించేందుకు హైదరాబాద్(Hyderabad) ఈఎన్సీ (ఇంజినీరింగ్ ఇన్ చీఫ్) కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. నీటి సరఫరా, రహదారి, ఇతర సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ 040-3517 4352 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరిండెంటింగ్ ఇంజినీర్లు (SE) , ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EE) ఉన్న కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా.. అధికారులు స్పందించేలా చర్యలు చేపట్టింది. ఈ కంట్రోల్ రూములతో సమాచార సేకరణ, స్పందన, పునరుద్ధరణ చర్యలపై సమన్వయం చేస్తున్నారు. ప్రజలు ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్లు కూలినా, గండ్లు పడ్డా వెంటనే సంబంధిత నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చు అని అధికారులు తెలిపారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీ రాజ్ శాఖ సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క ప్రకటించారు.
మంత్రి నిరంతరంపర్యవేక్షణ
వాతావరణ శాఖ(Meteorological Department) భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మంత్రి సీతక్క(Min Seethakka) పంచాతీరాజ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఏ జిల్లాలకు రెడ్ అలర్టు(Red Alert) ప్రకటిస్తే వెంటనే ఆయా జిల్లాలకు చెందిన అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారికి కావల్సిన మౌలిక సదుపాయాల్లో భాగంగా తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Ponguleti Srinivas Reddy: తెలంగాణ సమాజానికి మహిళలే పునాది.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు