Cine Workers Strike: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది. నేడు ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులను కలవనున్నారు. కార్మిక సంఘాలు నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్ లో చర్చించాయి. ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్ లో రెండు కండిషన్స్ దగ్గర చర్చలు ఆగాయి. 1)ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్, 2)సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షిట్ ఈ రెండు ప్రతిపాదనల దగ్గరే పీఠమడి పడింది. నిర్మాతలు అర్థం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలనే కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్.. ఈ మూడు విభాగాలకు వేతనాలు పెంచకపోవడం పై ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు యూనియన్ లకు తప్పించి మిగతా యూనియన్ సభ్యులకు 2000 వేలు లోపు ఉన్న కార్మికులకు 3 సంవత్సరాలకు 25 శాతం వేతనాలు పెంచుతామని నిర్మాతలు చెబుతున్నారు. ఆ మూడు యూనియన్లకు కూడా వేతనాలు పెంచి అడిగిన 30 శాతం పెంచితే మిగతా కండిషన్స్ దశలవారీగా అమలు చేస్తామంటున్నారు ఫెడరేషన్ నాయకులు. వీరి చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఏం జరుగుతోందో చూడాలి మరి.
Read also- Telangana Govt Jobs: ప్రభుత్వం గుడ్ న్యూస్.. 118 ఏపీపీ కొలువుల భర్తీకి నోటిఫికేషన్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) ఆధ్వర్యంలో సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు డిమాండ్‌తో ఆగస్టు 4, 2025 నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది. నిర్మాతలు కొంత మేర ముందుకు వచ్చినా ఫెడరేషన్ మాత్రం అన్ని సమస్యలు తీర్చిన తర్వాతే ముందుకు వెళ్తామని తేల్చి చెప్పింది. దీంతో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. కొంత మందిని రాజకీయ నాయకులను, సినీ పెద్దలను నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు కలిసినా ప్రయోజనం లేకపోయింది.
Read also- RGV – Chiranjeevi: చిరంజీవితో సినిమా క్యాన్సిల్ అవడానికి కారణం ఎవరంటే..?
ఇటీవలి చర్చలు
ఫిల్మ్ ఛాంబర్ భేటీలు: నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్‌లో పలు సార్లు చర్చలు జరిపారు, కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. నేడు (ఆగస్టు 16, 2025) మధ్యాహ్నం 3 గంటలకు మరో కీలక భేటీ జరగనుంది.
ప్రభుత్వ జోక్యం: నిర్మాతలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. దిల్ రాజు నేతృత్వంలో 15 మంది ప్రముఖ నిర్మాతలు ఈ భేటీల్లో పాల్గొన్నారు. అయితే, మంత్రి దుర్గేష్ ఈ విషయంలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోదని, ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మధ్య ఒప్పందం ద్వారా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
చిరంజీవి, ఇతర సీనియర్ నటులు: ఫెడరేషన్ నాయకులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణలను కలిసి సమస్యను వివరించారు. చిరంజీవి సమ్మెకు మద్దతు ఇవ్వలేదని ప్రకటించారు, కానీ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.