Telangana Govt Jobs: ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి రేవంత్ (Revanth Reddy)సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు(Telangana Police Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 285 ఏపీపీ పోస్టులు ఉండగా 120 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఖాళీగా ఉన్న 165 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో అధికారులు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో మల్టీజోన్ 1లో 50, మల్టీజోన్ 2లో 68తోపాటు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కానున్నాయి.
Also Read: Meeseva: ఈ సర్టిఫికెట్లు జారీ చేయడంలో మీ సేవ కీలకపాత్ర
వయసు 34ఏళ్లకు మించి ఉండకూడదు
ఇక, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లపాటు న్యాయవాదిగా పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. 2025, జూలై నాటికి వయసు 34ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. ఎంపిక కోసం రాత పరీక్ష ఉంటుంది. పేపర్ 1 ఆబ్జెక్టీవ్ విధానంలో ఉంటే పేపర్ 2 డస్క్రిప్టీవ్ విధానంలో ఉంటుంది. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 జీతం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే https;//www.tgprb.in వెబ్ సైట్‌ను సందర్శించాలి.