Kishkindhapuri Teaser: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)కు అర్జెంట్‌గా హిట్ కావాలి. ఆయన నుంచి కొంతకాలంగా మాస్ యాక్షన్ సినిమాలు వస్తున్నాయి కానీ, హిట్ మాత్రం కావడం లేదు. దీంతో తనకు అచ్చివచ్చిన జానర్‌లో మరోసారి నమ్ముకున్నారు. ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు మరోసారి అదే తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో.. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). సెప్టెంబర్ 12న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ ఫుల్ ఎమోషనల్ అవతార్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించనున్నారు. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది. (Kishkindhapuri Teaser Review)
Also Read- Sir Madam OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి, నిత్యామీనన్‌ల ‘సార్ మేడమ్’.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్.. ఈసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు హిట్ పక్కా అనేలా టాక్ రావడానికి కారణమవుతోంది. అలాంటి కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా ప్రమోషనల్ కంటెంట్ తెలియజేస్తుంది. ఆ విషయాన్ని ఇంకాస్త స్పష్టం చేసిందీ టీజర్ అని చెప్పుకోవచ్చు. టీజర్ విషయానికి వస్తే.. ‘‘నమస్కారం.. ఈ రోజు శుక్రవారం. 9-8-1989. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి.. పున: ప్రసారాలు నేటితో మొదలు’’ అనే వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్‌లోని ప్రతి షాట్ భయానకంగా ఉంది. తలుపును బాదుతున్నట్లుగా చూపించిన మొదటి షాట్ నుంచే ఓ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఒక వింటేజ్ మాన్షన్‌లోకి వెళ్లిన ఓ పాప, ఒక్కసారిగా అదృశ్యం అవుతుంది. ఆ సీన్ నుంచి టీజర్ ఎండింగ్ వరకు.. మిస్టీరియస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కంటి రెప్ప వాల్చకుండా అలా చూసేలా చేసింది.
ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ చిత్ర సక్సెస్‌కు ఇంతకంటే ఏం కావాలి. అప్పటి కాలం, రేడియో నుంచి వచ్చే ప్రసారాలు అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించారు. అనుపమ పరమేశ్వరన్ అతని లవర్‌గా కనిపించింది. ఈ టీజర్‌లో ఈ ఇద్దరి క్యారెక్టర్లను పరిచయం చేశారు. టెక్నికల్‌గానూ టీజర్ హై స్టాండర్డ్స్‌లో ఉంది. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ హైలైట్ అనేలా ఉన్నాయి. థ్రిల్స్, ఎమోషన్స్, సూపర్ న్యాచురల్ సస్పెన్స్‌తో వచ్చిన ఈ టీజర్.. ‘కిష్కిందపురి’ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసింది. ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వారికి టీజర్‌తోనే థ్రిల్‌ని పంచారు మేకర్స్. వారంతా సెప్టెంబర్ 12 కోసం వెయిట్ చేసేలా చేయడంలో ఈ టీజర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు