TG ( Image source: Twitter)
తెలంగాణ

Mana Ooru Mana Badi: కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయాలి.. సీఎంకు గుత్తా లేఖ

Mana Ooru Mana Badi: సీఎం రేవంత్ రెడ్డికి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం లేఖ రాశారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని లేఖలో కోరారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మన ఊరు- మన బడి కింద సివిల్ పనులు పూర్తయ్యాయని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు సైతం ధృవీకరించారని తెలిపారు.

Also Read: Fisheries Department: మేడ్చల్‌లో రూ.5.85 కోట్లతో భవనాల నిర్మాణం.. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు!

సివిల్ పనులకు పెండింగ్ బిల్లులు రూ.361.350 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరారు. చిన్న కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (స్కూల్ పేరెంట్స్ కమిటీ) అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యతని లేఖలో పేర్కొన్నారు. రుణాలు తీసుకుని ఈ పనులను పూర్తి చేశారని, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అసలు కంటే మిత్తి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.361.350 కోట్ల పెండింగ్ బిల్లులను అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని సీఎంను గుత్తా కోరారు.

Also Read: Telangana Jagruti Presidents: 11 జిల్లాలకు జాగృతి జిల్లా అధ్యక్షుల నియామకం.. ప్రాధాన్యం ఎవరికంటే?

Just In

01

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?