Telangana Jagruti Presidents: తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు అనుబంధ విభాగాలకు అధ్యక్షులతో పాటు 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) ప్రకటించారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు నుంచి సంస్థాగత పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ నియామకాల్లోనూ ఆయా కులాలతో పాటు మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. 11 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తే వారిలో ఐదుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ ఉండగా, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించామని పేర్కొన్నారు.
Also Read- Durga Mata Temple Closed: భారీ వర్షాల ఎఫెక్ట్.. అక్కడ దుర్గామాత ఆలయం మూసివేత
జాగృతి ఆర్గనైజింగ్ సెక్రెటరీగా దూగుంట్ల నరేష్ ప్రజాపతి, అధికార ప్రతినిధిగా నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా లోకిని రాజు, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇత్తరి మారయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈగ సంతోష్ ముదిరాజ్, ఎంబీసీ అండ్ సంచార జాతుల విభాగం అధ్యక్షుడిగా రాచమల్ల బాలక్రిష్ణ, సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్. వెంకటేష్, జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మేక లలిత యాదవ్, యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా కంచర్ల శివారెడ్డి, ఉపాధ్యక్షులుగా అల్వాల జితేందర్ ప్రజాపతి, భూక్యా రవి రాథోడ్, పాలె నిషా లెనిన్, కంచిగారి ప్రవీణ్ ముదిరాజ్, జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మునుకుంట్ల నవీన్ గౌడ్, హైదరాబాద్ జిల్లా విద్యార్థి అధ్యక్షుడిగా గుమ్మడి క్రాంతి కుమార్, నిజాం కాలేజ్ అధ్యక్షుడిగా వల్లకొండ అజయ్ రెడ్డి, సాహిత్య జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా కాంచనపల్లి గోవర్దన్ రాజు, రైతు జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా మంథని నవీన్ రెడ్డి, జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా శశిధర్ గుండెబోయిన, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హరికృష్ణ బ్రహ్మాండభేరి, మైనారిటీ ముస్లీం విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మహమ్మద్ ముస్తఫా, మైనారిటీ క్రిస్టియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జి.డేవిడ్, ఆటో జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్ సలీం నియామకం అయ్యారు.
Also Read- Khammam Police Station: మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా పడుకున్న వ్యక్తి.. 11 మందిపై కేసు నమోదు
11 జిల్లాల జాగృతి అధ్యక్షులు వీరే:
ఎదురుగట్ల సంపత్ గౌడ్ (కామారెడ్డి జిల్లా), చందుపట్ల సుజీత్ రావు (యాదాద్రి భువనగిరి జిల్లా), చెర్లపల్లి అమర్ దీప్ గౌడ్ (జగిత్యాల), భూక్యా జానూ బాయి (నిర్మల్), వినోద్ (కుమురం భీమ్ ఆసిఫాబాద్), రామిడి వెంకట్ రెడ్డి (మేడ్చల్ మల్కాజ్ గిరి), దారమోని గణేష్ (నాగర్ కర్నూల్), గవినోళ్ల శ్రీనివాస్ (నారాయణపేట), ఎస్. క్రిష్ణవేణి (సూర్యాపేట), పర్లపల్లి శ్రీశైలం (హన్మకొండ), మాడ హరీశ్ రెడ్డి(భూపాలపల్లి).
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు