TS-EDCET-DOST
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TS EDCET: ఎడ్ సెట్ సెల్ఫ్ రిపోర్టింగ్‌పై గుడ్‌న్యూస్

TS EDCET: ఈ నెల 20 వరకు గడువు పొడిగింపు

భారీ వర్షాల నేపథ్యంలో అడ్మిషన్స్ కన్వీనర్ నిర్ణయం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఎడ్ సెట్ (TS EDCET) మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకునే గడువును పొడిగించినట్లు ఎడ్ సెట్ అడ్మిషన్స్ కన్వీనర్ పాండురంగా రెడ్డి గురువారం ప్రకటించారు. వాస్తవానికి గురువారంతోనే ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే, భారీ వర్షాల కారణంగా గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు తెలిపారు.

త్వరలోనే ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్లు
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, యూనివర్సిటీల్లో ప్రవేశాలకు దోస్త్ ద్వారా అడ్మిషన్లు చేపడుతున్నట్లు వివరించారు . అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇదిలావుంచితే, దోస్త్ స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు స్కాలర్ షిప్‌కు అనర్హులని స్పష్ టంచేసింది. ఇతర వివరాల కోసం http:dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Read Also- Durga Mata Temple Closed: భారీ వర్షాల ఎఫెక్ట్.. అక్కడ దుర్గామాత ఆలయం మూసివేత

డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్
డీఐఈడీలో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 17న కాలేజీల వారీగా ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించనున్నారు. నోటిఫికేషన్ ఈనెల 18న వెలువడుతుంది. ప్రభుత్వ డైట్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 19న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 20న వెరిఫికేషన్ ఉంటుంది. కాగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని షెడ్యూల్‌లో వివరించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను ఈనెల 22 సాయంత్రం 6 గంటల వరకు ప్రిన్సిపాళ్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని షెడ్యూల్‌లో స్పష్టం చేశారు. ఈనెల 25న డీఈఈసెట్ కన్వీనర్ రాటిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుందని వివరించారు.

Read Also- Crime News: బస్సులో పరిచయం.. చేపలు ఇస్తానంటూ మహిళను కిందకు దింపి..

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?