Medak News
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Crime News: బస్సులో పరిచయం.. చేపలు ఇస్తానంటూ మహిళను కిందకు దింపి..

Crime News:

మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో 38 ఏళ్ల మహిళపై దాడి (Crime News) జరిగిన విషయం తెలిసిందే. తులం బరువు ఉన్న 2 బంగారు చెవి రింగులు దోచుకోవడంతో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్‌ గురువారం వెల్లడించారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం మదుల్వాయి గ్రామానికి చెందిన గజ్జల భిక్షపతి (27) అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ‘‘మెదక్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి నర్సాపూర్ వైపు వెళ్తుండగా బస్సులో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. మద్యం, చేపలు, డబ్బు ఇస్తానంటూ ఆమె నమ్మించాడు. నర్సాపూర్‌లో ఆమెతో కలిసి బస్సు దిగి మద్యం కొన్నాడు. అనంతరం ఆమెను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. ఆ తర్వాత మద్యం మత్తులోకి జారుకున్న బాధితురాలిపై దాడి చేసి బంగారు రింగులు లాక్కొని పారిపోయాడు’’ అని వివరించారు.

Read Also- BJP Telangana strategy: తెలంగాణలో బీజేపీ పక్కా ప్లాన్

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ మొదలుపెట్టామని, దర్యాప్తులో భాగంగా నర్సాపూర్‌లోని ఓ వైన్ షాపులో కీలకమైన సీసీటీవీ ఆధారాల లభ్యమయ్యాయని ఎస్పీ చెప్పారు. నిందితుడు వేసుకున్న దుస్తులు, ఆనవాళ్లకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని దర్యాప్తు బృందం స్వీకరించిందన్నారు. గురువారం ఉదయం నిందితుడికి సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు వెళ్లడి అక్కడ అతడి అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. నిందితుడి వద్ద దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

భిక్షపతి పాత నేరస్తుడు..
నిందితుడు భిక్షపతి పాత నేరస్థుడు అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మద్దులవాయి గ్రామానికి చెందిన నివాసి. గతంలో పలు నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన భిక్షపతి, మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని రెండో భార్యతో కలిసి గుమ్మడిదరిలో నివాసి నివాసం ఉంటున్నాడు. మద్యం, జూదం వంటి వ్యసనాలకు బానిస అయ్యాడు. పలు ఆస్తి నేరాలకు పాల్పడ్డాడు. 2015 సంవత్సరంలో మెదక్ టౌన్ పరిధిలో దొంగతనం కేసులో మొదటిసారి అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో 10 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన నేరాల్లో అరెస్ట్ అయ్యాడు. ఈ నెల 11న కంది జైలు నుంచి భిక్షపతి విడుదలయ్యాడు. 13వ తేదీన పాత కేసుల విషయంలో న్యాయవాదిని కలిసేందుకు మెదక్ వెళ్లి తిరిగుముఖంలో బిక్షపతి బస్సులో బాధితురాలతో పరిచయం పెంచుకొని ఈ నేరానికి పాల్పడ్డాడు.

Read Also- HYDRA: కీలక ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన.. ఎందుకంటే?

మద్యం, చేపలు, డబ్బు ఇస్తానంటూ మోసపూరిత మాటలు చెప్పి ఆమెను నరసాపురం అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి మద్యం సేవించాడు. మత్తులోకి జారుకోగానే దాడి చేసి చెవి రింగులు లాక్కొని పరారయ్యాడనీ ఎస్పీ శ్రీనివాస్ రావు వివరించారు. 24 గంటల్లోనే కేసును చేధించిన డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డిలను ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేంద్ర అభినందించారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ