Bigg Boss Agnipariksha
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Agnipariksha: వీడియో లీక్.. ఎందుకంత సీరియస్ అంటూ నవదీప్‌పై కౌంటర్స్!

Bigg Boss Agnipariksha: త్వరలో ప్రారంభం కాబోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)కు సంబంధించి కసరత్తులు మొదలయ్యాయి. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎక్కువ మంది హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇన్ని సీజన్లుగా ఈ షోని ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం ‘రిటర్న్ గిఫ్ట్’ అంటూ నాగార్జున (King Nagarjuna) చేసిన అనౌన్స్‌మెంట్‌తో ఈసారి ఈ షో‌పై భారీగా హైప్ పెరిగింది. ఆ హైప్‌కి తగ్గట్టే సామాన్యుల నుంచి వేల మంది ఈ షోలో పాల్గొనడానికి ఉత్సాహం ప్రదర్శించినట్లుగా నిర్వాహకులు చెప్పుకొచ్చారు. హౌస్‌లోకి వెళ్లేందుకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వేలాది మంది నుంచి రకరకాలుగా జల్లెడ పట్టి 40 మంది కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసినట్లుగా బిగ్ బాస్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అలా జల్లెడ పట్టిన 40 మందికి బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ పెట్టబోతున్నారు.

Also Read- Manchu Lakshmi: యాప్ వాళ్లు ఎలా సంప్రదించారు? మూడున్నర గంటలపాటు ఈడీ ప్రశ్నల వర్షం

ఈ అగ్నిపరీక్షకు నవదీప్ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi), అభిజిత్ (Abijeet) మాస్టర్స్‌గా ఉండబోతున్నారని తెలుపుతూ ఓ ప్రోమోని కూడా విడుదల చేశారు. ఈ ముగ్గురు మాస్టర్స్‌ని దాటుకుని, అగ్నిపరీక్ష ఎదుర్కొని హౌస్‌లోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదనేలా ఇప్పుడొక లీక్డ్ వీడియో స్పష్టం చేస్తుంది. ఈ లీక్డ్ వీడియోలో బిందు మాధవి.. ‘మరీ ఎందుకు అంత ఓవరాక్టింగ్ చేస్తున్నావ్?’ అని ఓ సామాన్యుడిని ఉద్దేశించి అంటుంటే.. నవదీప్ మాత్రం సీరియస్ అవుతూ, టేబుల్‌ని గట్టిగా నెట్టేసి పక్కకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడీ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Congrats to Hydraa: హైడ్రా జిందాబాద్ అంటూ ఆ కాలనీవాసులు సందడి.. ఆ ఒక్క పనితో ప్రజల్లో ఆనందం

ఈ వీడియోకు పడుతున్న కామెంట్స్ చూస్తే మాత్రం నవదీప్ షాకవడం ఖాయం. ఎందుకంటే, అంతలా నవదీప్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘పాపం ఆ నవదీప్ సినిమాలో ఈ యాక్టింగ్ చేసినా.. గొప్ప ఆర్టిస్ట్‌గా మరి ఇప్పుడు కనీసం 2 సినిమాలు చేతిలో ఉండేవి’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇలాంటి లీక్డ్ వీడియోలతో బిగ్ బాస్‌పై ఉన్న ఇంట్రస్ట్ మరింతగా తగ్గిపోతుందని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ముగ్గురు అంత షో చేయడం అవసరమా? అని కొందరు అంటుంటే.. అలా షో చేసే వాళ్లకేగా అక్కడ ఛాన్స్ వచ్చేది అంటూ నెటిజన్లు రిప్లయ్ ఇస్తున్నారు. మొత్తంగా అయితే.. ఇలాంటి కామెంట్స్‌తో ఈ లీక్డ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. మరి ఈ మాస్టర్స్‌ని దాటి, అగ్నిపరీక్షలో నెగ్గి.. హౌస్‌లోకి అడుగు పెట్టే ఆ సామాన్యులు ఎవరనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?