manchu-lakshmi( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Betting Apps Case: బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న

Betting Apps Case: బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో నటి మంచు లక్ష్మీ ప్రసన్నపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో భాగంగా ఆగస్టు 13, 2025న హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో లక్ష్మీ ప్రసన్న విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆమెతో పాటు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి ఇతర నటులు కూడా ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. మంచు లక్ష్మీ బెట్టింగ్ యాప్‌(Betting Apps Case)ల ప్రచారం ద్వారా సంపాదించిన పారితోషికం కమీషన్ల గురించి ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు, సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్‌కు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఉంది. ఇందులో నటులు నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విచారణలో ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించమని ఈడీ అధికారులు కోరినట్లు సమాచారం.

Read also- Chitrapuri 300 Cr Scam: చిత్ర పురిలో రూ.300 కోట్ల స్కాం.. అధ్యక్షుడిని అరెస్టు చెయ్యాలని డిమాండ్

ఇప్పటికే దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఇక ముందు తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయబోనని, హానికరమైన వ్యాపారాల ప్రమోషన్ల విషయంలో దూరంగా ఉంటానని విచారణ అనంతరం ప్రకటించారు ప్రకాశ్ రాజ్. తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదని, తాను ప్రమోషన్ చేసింది గేమింగ్ యాప్ మాత్రమే అని, అన్ని అనుమతులు ఉన్న లీగల్ గా కొనసాగుతున్న గేమింగ్ యాప్ ప్రమోషన్ లో మాత్రమే పాల్గొన్నానని స్పష్టం చేశారు విజయ్ దేవరకొండ. ఈడీ ఎప్పుడు కోరినా విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు.

Read also- War 2 Bookings: ‘వార్ 2’ లో ఎన్టీఆర్ చేసిన తప్పులు ఇవేనా!

విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్‌తో పాటు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల (Ananya Nagalla), ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi), యాంకర్ శ్యామల (Anchor Shyamala), యూట్యూబర్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ (Bhayya Sunny Yadav), లోకల్ బాయ్ నానిలతో పాటు మరికొందరిపై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్–సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ఆధారంగా, పీఎంఎల్ఏ కింద వీరిని ఈడీ విచారించనున్నది. ఇప్పుడు కొందరికే నోటీసులు ఇవ్వగా.. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చి ఈడీ విచారించనున్నది. ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అక్రమంగా డబ్బును తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాకుండా నోటీసుల అందుకున్న వారి బ్యాంకు లావాదేవీలు, వ్యాపార పెట్టుబడులు, ఈ బెట్టింగ్ యాప్‌లతో వారికి ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో విచారించనున్నారు. వారి ఆర్థిక మూలాలపై కూడా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్, జూదాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇది ఈ కేసులో దర్యాప్తుకు మరింత బలం చేకూర్చింది. కాగా, ఈ వరుస విచారణలు టాలీవుడ్‌లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నది. ఈడీ విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు