Telangana Rains: రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ(Meteorological Department) హెచ్చరిస్తున్న నేపద్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, అనకట్టలు, కాల్వలతో పాటు చెరువుల భద్రత పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిఘా పెంచాలని ఆయన సూచించారు. విపత్తులు సంభవించే సూచనలు కల్పిస్తే అధికార యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం చేయాలన్ని అన్నారు.
తక్షణ నివారణ చర్యలు
రాష్ట్రంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సహా అన్నివిభాగాల అధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాలతో ఎటువంటి నష్టాలు కలుగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సన్నద్ధం కావాలని ఆయన మంత్రి చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటు ఎటువంటి సందర్భం ఎదురైన తక్షణ నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుగా అందరు సిద్ధం కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) రాష్ట్ర నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా(rahul Bojna), ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్(K srinivass), ఇ. ఎన్.సి అంజద్ హుస్సేన్ లతో పాటు ఆయా జిల్లాల సి.ఇ లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Cyber security bureau: ఇక యుద్ధమే.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఫోకస్!
వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలో రానున్ప వారం రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య ప్రాంత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. అయితే 13,14 తేదీల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆయా జిల్లాలకు వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
నేడు రాష్ట్రంలోని హన్మకొండ(Hanumakonda), జనగాం, మహబూబాబాద్(Mehabubabad), వరంగల్(Warangal), యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్(Hyderabad), జయశంకర్ భూపాలపల్లి(jayashankar Bhupala Pally), కరీంనగర్(Karem Nagaar), మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు(Mulugu), పెద్దపల్లి, రంగారెడ్డి(Rangareddy), సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాణ తెలిపింది.
Also Read: Viral Video: మగాడికే కాదు.. సింహానికి అదే పరిస్థితి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!