Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆగస్టు 22, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. అలాగే, దీనిలో ఇందులో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఒక విచిత్రమైన ఊరి నేపథ్యంలో తెరకెక్కింది. ఇక్కడ అమ్మాయిలు తమ ముఖాలను పరదాలతో కప్పుకుంటారు. ఇంత వరకు ఇలాంటి కథతో ఎలాంటి మూవీ రాలేదు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ లో అనుపమ సంచలన కామెంట్స్ చేసింది.
Also Read: KTR on Congress govt: ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఖతం పట్టించింది.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
అనుపమ, సిద్ధు జొన్నలగడ్డ మధ్య సినిమాలోని కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. “ఓ మై లిల్లీ” పాటలో ఇద్దరూ ఒకర్ని మించి ఇంకొకరు రొమాంటిక్ సీన్స్ లో నటించారు. అయితే, దీని గురించి మొదటి సారి ఈ ముద్దుగుమ్మ ఓపెన్ అయింది. టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు కంఫర్ట్ గా అనిపించలేదు. ఆ సినిమా చేయడానికి ముందు చాలా కాలం ఆలోచించా.. అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు. నా మనసు నాకు వద్దని చెబుతూనే ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా, ఈ సినిమాలో లిల్లీ పాత్ర అసలు నచ్చలేదని తెలిపింది. 100 శాతం ఇష్టంతో చేయలేదు. ముద్దు సీన్స్ మొత్తం బలవంతంగా చేయాల్సి వచ్చిందని అనుపమ సంచలన కామెంట్స్ చేసింది.
Also Read: BRS on Congress: బీఆర్ఎస్ విలీనం ప్రచారాన్ని ఎండగట్టాలి.. నేతలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
టిల్లు స్క్వేర్ సినిమా
టిల్లు స్క్వేర్ 2024లో రిలీజైన ఒక తెలుగు రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం. ఇది 2022లో హిట్ అయిన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్ నేహా శెట్టి అతిథి పాత్రలో కనిపించింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.