Jr NTR: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సీరియస్ అవడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన నా వెనుక ఎవరూ లేరని చెప్పడం, నందమూరి బాలకృష్ణ పేరు చెప్పకపోవడం.. నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా కార్యక్రమంలో మధ్యలో ఎన్టీఆర్ ప్రసంగిస్తుండగా ఫ్యాన్స్ అందరూ ‘జై బాలయ్య’ అని ఫ్యాన్స్ అరుస్తుండటంతో.. ఉండమంటారా? వెళ్లిపోమంటారా? అంటూ ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు. ఇది నందమూరి ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. అలాగే తన తండ్రి, తాతల పేర్లు చెప్పిన ఎన్టీఆర్.. బాబాయ్ బాలకృష్ణ పేరు చెప్పకపోవడం ఏమిటని? నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ‘నీ పతనం మొదలైంది’ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో బాలయ్య పేరును వాడుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు ఆయన పేరు కూడా మాట్లాడడానికి ఇష్టపడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొన్నటి వరకు ఏదో ఒక టైమ్‌లో బాలయ్య పేరు చెప్పిన ఎన్టీఆర్.. ఇప్పుడు నేషనల్ వైడ్‌గా గుర్తింపు రావడంతో.. పునాదుల్ని మరిచిపోయాడంటూ నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో.. రేపు సినిమాపై చూపిస్తామంటూ హెచ్చరికలు చేసే స్థాయిలో కామెంట్స్ పడుతున్నాయంటే.. ఎంతగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. మరి ఇది ఎంత వరకు వెళుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.
అసలీ ఫంక్షన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘వార్ 2’ అనేది ఎన్టీఆర్ హిందీలోకి వెళ్తున్న సినిమానే కాదు.. హృతిక్ తెలుగులోకి వస్తున్న చిత్రం కూడా. అభిమానులంతా కూడా హృతిక్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నా కెరీర్ మొదలైంది. స్వర్గీయ రామోజీరావు నన్ను పరిచయం చేశారు. అప్పుడు మా నాన్న, అమ్మ తప్ప ఇంకెవ్వరూ నా పక్కన లేరు. ఆధోని నుంచి ముజీబ్ అనే వ్యక్తి.. మొదట అభిమానిని అంటూ వచ్చాడు. అలా మొదలైన నా జర్నీలో ఇప్పుడు ఇంతమంది అభిమానులు దొరికారు. అభిమానుల నుంచి ఇంత ప్రేమ దొరకడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. ఇన్నేళ్లలో నాతో ఎంతో మంది అభిమానులు కలిసి వస్తున్నారు. దీనంతటికి కారణమైన కీర్తి శేషులు మా తండ్రి హరికృష్ణ, మా అమ్మ శాలిని, మా అమ్మ లక్ష్మీ, మా అన్న కీర్తి శేషులు జానకీ రామ్, ఇంకో అన్న కళ్యాణ్ రామ్‌లకు ధన్యవాదాలు. ఈ జర్నీలో నన్ను ఆదరించి, ప్రేమించిన ప్రతీ దర్శక, నిర్మాతలకు శిరస్సువంచి పాదాభివందనాలు చేస్తున్నాను. 25 ఏళ్లు నన్ను ప్రోత్సహిస్తున్న మీడియా వారికి పాదాభివందనాలు. నా వెన్నంటే నడిచిన మిత్రులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, నటరత్న, పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. రత్నల్లాంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చిన నా భార్య ప్రణతికి, పెద్ద కొడుకు అభయ్, చిన్న కొడుకు భార్గవ్‌కి నమస్కారాలు బాగుండదు కానీ హగ్స్ ఇస్తాను. ఒక తల్లికి పుట్టకపోయినా, నన్ను కడుపులో పెట్టుకుని, నా బాధలో పాలు పంచుకునే, ఆనందంలో ఆనందాన్ని పంచుకునే అభిమానులకు ఎంత చేసినా, ఏం చేసినా రుణం తీర్చుకోలేను. కొడుకుగా మా నాన్న నాకు జన్మను ఇచ్చినా.. నా ఈ జన్మ మాత్రం అభిమానులకే అంకితం.
Also Read- Kingdom OTT: ఓటీటీలోకి ‘కింగ్‌డమ్’.. ఇంత త్వరగానా? స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ఇక ‘వార్ 2’ సినిమా విషయానికి వస్తే.. ఇండియన్ ఐకానిక్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో YRF (యశ్ రాజ్ ఫిల్మ్స్) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాతగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకాబోతోంది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ మంచి స్పందనను రాబట్టుకోగా, ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మరి ఈ కాంట్రవర్సీ ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్ట్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
