jr ntr at war 2 Pre Release event
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: సీఎం రేవంత్‌కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?

Jr NTR: ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్‌ (Jr NTR)లతో ఆదిత్య చోప్రా నిర్మించిన భారీ చిత్రం ‘వార్ 2’ (War 2). అయాన్ ముఖర్జీ దర్శకుడు. YRF స్పై యూనివర్స్ నుంచి రానున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఆగస్ట్ 14న హిందీ, తెలుగు, తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా హాజరై, తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ముగ్ధులయ్యారు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాణంలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ముంబైలో ఉండటం అంటే తనకు ఇష్టం ఉండదని, కానీ అక్కడ తనకి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి, హైదరాబాద్‌లో ఉన్న ఫీలింగ్‌ని కల్పించిన మేకర్స్‌కి ఆయన థ్యాంక్స్ చెప్పారు.

Also Read- Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్‌కు ‘మోస్ట్ డిజైరబుల్’ అవార్డ్.. ఎవరికి అంకితం ఇచ్చారంటే?

ఆ తర్వాత సినిమా గురించి, హృతిక్ రోషన్ గురించి, అభిమానుల గురించి, 25 సంవత్సరాల తన సినీ కెరీర్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. చాలా తక్కువ సమయంలో ఈ వేడుకను జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయారు. ఇంతకు ముందు అల్లు అర్జున్ ఓ వేడుకలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయిన విషయం తెలిసిందే. కానీ, ఈ స్టేజ్‌పై అసలు సీఎం రేవంత్ రెడ్డి ఊసునే ఎన్టీఆర్ తీసుకురాలేదు. ఈ వేడుకకు వచ్చిన జనం, పక్కన బాలీవుడ్ స్టార్ హీరో, ఫ్యాన్స్ అరుపులు, ఏ క్షణమైనా వరుణుడు ప్రతాపం చూపే అవకాశం ఉండటంతో.. ఎన్టీఆర్ చాలా మందికి థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయారు. గెస్ట్‌గా వచ్చిన త్రివిక్రమ్, హీరోయిన్ కియారా పేర్లు కూడా ఆయన ప్రస్తావించలేదు.

Also Read- Nani Filmfare Award: 2025 ఫిల్మ్‌ఫేర్ అవార్డులో హాటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్‌గా నాచురల్ స్టార్

అయితేనేం, తనేం మరిచిపోయాడో అదే విషయాన్ని గుర్తించి, వెంటనే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డికి, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రీ రిలీజ్ ఇంత గొప్ప సక్సెస్ కావడానికి సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తన పోస్ట్‌లో ఎన్టీఆర్ పేర్కొన్నారు. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ స్టేజ్‌పై రెండు సైడ్స్ కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్.. ఈ సినిమా మీరు ఊహించని విధంగా ఉంటుందని, ట్విస్ట్‌లు అదిరిపోతాయని తెలిపారు. సినిమా చూసిన వాళ్లు దయచేసి ట్విస్ట్‌లను రివీల్ చేయవద్దని కోరారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. హృతిక్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!