Operation Akarsh: తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు బీజేపీ(BJP) ఆపరేషన్ ఆకర్ష్(Operation Akarsh) కు శ్రీకారం చుట్టింది. పార్టీ బలోపేతం చేసుకోవడంలో భాగంగా జాయినింగ్స్ పై రాష్ట్ర నాయకత్వం దూకుడుగా ముందుకు పోతోంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ఆపరేషన్ ఆకర్ష్ పరేషాన్‌కు కారణమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ జాయినింగ్స్ నేతల మధ్య చిచ్చురేపుతోందని సమాచారం. బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvala Balaraju) బీజేపీలో చేరుతుండటం ఈ వివాదానికి కారణమవుతోంది. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు. అయితే ఇదంతా ట్రాప్ అని గతంలో నుంచే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్(BL Santhosh) పై ఆరోపణలు, విమర్శలు చేసినవారిని చేర్చుకోవడం విమర్శలకు దారితీస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన చేరిక ఢిల్లీలో కాకుండా స్టేట్ ఆఫీస్ లో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.
గువ్వల బాలరాజును చేర్చుకోవడంపై వ్యతిరేకత
ఆపరేషన్ ఆకర్ష్ ను టీబీజేపీ(TBJP) అట్టహాసంగా ప్రారంభించింది. బీఆర్ఎస్(BRS) కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అందులో కేవలం ఒకే ఒక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రమే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. మరికొంతమంది కొంత టైం కావాలని అడిగినట్లు తెలిసింది. అయితే అచ్చంపేటలో మాజీ ఎంపీ రాములు(Ramulu), నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్(Barath) ను కాదని.. తాజాగా గువ్వల బాలరాజును చేర్చుకోవడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. గతంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసినవారిని చేర్చుకోవడంపై ఒక వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా పార్టీని ఎన్నో ఏండ్లుగా నమ్ముకున్న వారు సైతం ఆగ్రహంగా ఉన్నారు.
Also Read: Health Tips: 30 మ్యాజిక్ టిప్స్.. మీకు తెలియకుండానే రోజుకు 10,000 స్టెప్స్ నడిచేస్తారు!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో
తెలంగాణ (Telangana)బీజేపీ రథసారథిగా రాంచందర్ రావు(Ram Chendar Rao) బాధ్యతలు చేపట్టిన తర్వాత జోష్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలతో బిజీబిజీగా ఉంటున్నారు. కేవలం పర్యటనలతో సరిపెట్టకుండా పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేరికలతో ఎదురయ్యే సమస్యలపై చర్చించకుండానే కొత్త సారథి దూకుడుగా వెళుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును త్వరలో బీజేపీ(BJP)లో చేర్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈనెల 10న మూహుర్తం ఫిక్స్ చేశారు. మొత్తంగా బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్(Operation Akarsh) నేతల మధ్య చిచ్చురేపుతోంది. ఇదిలా ఉండగా ఇంకొందరు నేతలు వస్తారని జరుగుతున్న ప్రచారం నిజమవుతుందా? లేక సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలతో పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వాయిదా వేసుకుంటుందా? అనేది చూడాలి.
Also Read: Rajinikanth Fans: తలైవాపై తనివి తీరని అభిమానం.. గుడికట్టి ప్రత్యేక పూజలు