Paradha trailer: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘పరదా’(parada). తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు, శ్రీధర్ లు కథపై ఉన్న నమ్మకంతో సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. లక్షల్లో వ్యూస్ సాధించి అందరి మన్ననలు పొందుతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ తదితరులు ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో రామ్ పోతినేని ట్రైలర్ ను విడుదల చేశారు.
Read also- 500 Women Tied Rakhi: సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కు రాఖీలు కట్టిన 500 మంది మహిళలు
రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలి అది ఈ సినిమా నిర్మాతలకు బాగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి రూపాయి తర్వాత ఇలాంటి సినిమాలు తీసే నిర్మాతలకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సినిమాకు నిర్మాతలే హీరోలు. అనుపమ ప్రతి సినిమాకు ఆమె చెయదగినంత చేస్తుంది. ఈ సినిమాలో నాకో సందేహం ఉంది. పరదా వేసినపుడు టేక్ ఓకే ఎలా చేశారా’ అని అన్నారు. అనంతరం రామ్ నుంచి రాబోయే సినిమా నుంచి ఓ డైలాగ్ చెప్పారు.
Read also- Inspirational Story: 9వ తరగతిలో చదవు మానేసి.. నేడు ఊహించని స్థానంలో ఉన్నాడు
‘ఈవిడేంటి నార్త్ ఇండియా నుంచి వచ్చి మనూళ్లో సెటిల్ అయిన వాళ్లా’ అంటూ రాజేంద్ర ప్రసాద్ వాయిస్ తో మొదలవుతోంది ట్రైలర్. ఒక ఊరిలో ఆచారం ప్రకారం ఆడవారి మొహం ఎవరికీ చూపించరు. దానిని పరదాతో కప్పుకుని తిరుగుతారు. అనే అంశం చుట్టూ తిరుగుతోంది ట్రైలర్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ను చూస్తుంటే పరదాలు వేసుకుని కనిపిస్తుంది. దానిని తీయడానికి సంగీత, రాగ్ మయూర్లు ఏం చేశారు అనే దానిపై తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒక ఆచారం ప్రకారం ఓ ఊరి జనం చేయని తప్పును హీరోయిన్ మీద వేయడంతో కథ మొదలయ్యేలా ఉంది. సస్పెన్స్ గా నడిచే కథలా కనిపిస్తుంది. ప్రొడక్షన్ విలువలు చూసుకుంటే చాలా బాగున్నాయి. ఇలాంటి కథకు సంగీతం మరింత ఆసక్తిని జోడిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు ఓ మంచి కథతో రాబోతున్నట్లు కనిపిస్తోంది. విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.