Jadcharla MLA: వంశీరామ్ మన్ హట్టన్‌లో ప్లాట్స్ కొనుగోలు చేయొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిలో వంశీరామ్ బిల్డర్స్ అక్రమ కట్టడాలు చేశారన్నారు. కోర్టులో కేసు కూడా నడుస్తుందన్నారు. థర్డ్ పార్టీకి నోటీసులు కూడా వెళ్లాయన్నారు. జడ్జీ మారడం వలన ఆ కేసు ఇంకా బెంచ్ మీదకు రాలేదని, వచ్చే వారం వస్తుందన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు కలిసి పిల్ వేశామన్నారు.
Also Read: ICICI Bank New Rules: కస్టమర్లకు బిగ్ షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన నిర్ణయం!
గత ప్రభుత్వ హయంలో రంగారెడ్డి కలెక్టర్ ఎన్‌వోసీ కూడా ఇచ్చారన్నారు. ప్రభుత్వ భూమిగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. వంశీరామ్ మన్ హట్టన్‌లో ప్లాట్స్ కొని మోస పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వ హయంలో ప్రజాప్రతినిధుల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని వలన చాలా మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పదేళ్లు పవర్ లో ఉంటుందన్నారు. పదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతారని ఆయన వెల్లడించారు.