Kantara - Chandramukhi (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Kantara – Chandramukhi: నిద్రలేచిన చంద్రముఖి.. కాంతార టీమ్‌ను వెంటాడుతున్న మృత్యువు.. రెండింటికి లింకేంటి?

Kantara – Chandramukhi: కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార చిత్రం.. యావత్ దేశాన్ని ఏ స్థాయిలో అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకూ పెద్దగా తెలియని నటుడు రిషబ్ శెట్టిని (Rishab Shetty).. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఈ చిత్రం తీర్చిదిద్దింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కనక వర్షం సైతం కురిపించింది. అయితే వీటన్నింటిని పక్కన పెడితే.. కాంతార షూటింగ్ మెుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు పనిచేసిన వారిని మృత్యువు వెంటాడుతోంది. చిత్ర యూనిట్ లోని వ్యక్తులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. తాజాగా శుక్రవారం ఇందులో పూజారిగా చేసిన టి. ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. గతంలో చంద్రముఖి సినిమా అప్పుడు కూడా ఆ చిత్ర యూనిట్ కు ఇలాంటి విషాధాలే ఎదురయ్యాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కాంతార టీమ్ మరణాలు..
ప్రముఖ కన్నడ థియేటర్ ఆర్టిస్ట్, నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి శుక్రవారం (ఆగస్టు 8) హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. కాంతార టీమ్ ఇలా ప్రమాధాలు ఫేస్ చేయడం ఇదే మెుదటి సారి కాదు. గతంలోనూ ఈ సినిమాకు వర్క్ చేసిన నటులు, టెక్నిషియన్స్ ను మృత్యువు కబళించింది. కేరళలోని కొట్టాయంకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎం.ఎఫ్. కపిల్ మరణం ఈ ఏడాది మే6న జరిగింది. కాంతార 2 షూటింగ్ సమయంలో అతడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించినట్లు వార్తలు వచ్చాయి. అదే నెల 12వ తేదీన 34 ఏళ్ల నటుడు రాకేష్ పూజారి కూడా ఒక వివాహ కార్యక్రమానికి హజరై ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. దీనికి తోడు గతేడాది నవంబర్ లో షూటింగ్ నుండి తిరిగి వస్తున్న జూనియర్ ఆర్టిస్టుల మినీ బస్సు ప్రమాదానికి గురైంది. అంతకుముందు షూటింగ్ కోసం నిర్మించిన ఒక పెద్ద సెట్ గాలివాటం వల్ల ధ్వంసమైంది. అలాగే 2025 జనవరిలో అటవీ శాఖ అధికారులతో చిత్ర బృందానికి వివాదం తలెత్తింది. అడవిలో షూటింగ్ సందర్భంగా డైనమైట్ ను వాడినట్లు ఆరోపణలు రావడంతో చిత్ర బృందం కేసు నమోదైంది. ఇలా చిత్ర బృందానికి తరుచూ ఏదోక సమస్య ఎదురవుతూనే ఉంది.

చంద్రముఖి సమయంలోనూ అంతే..
గతంలో విడుదలైన హారర్ చిత్రం ‘చంద్రముఖి’ సమయంలోనూ వరుసగా నటీ నటులు ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. కన్నడలో చంద్రముఖిగా చేసిన స్టార్ నటి సౌందర్య 2004లో విమాన ప్రమాదంలో మరణించారు. మరోవైపు కన్నడలో హీరోగా చేసిన దిగ్గజ నటుడు విష్ణువర్థన్ సైతం 2009లో అకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే తమిళ చంద్రముఖిలో నీలాంబరి అనే పాత్రలో నటించిన మనోబాల సైతం 2023లో ప్రాణాలు కోల్పోయారు. వీరితో ఆయా చిత్రాల్లో నటించిన పలువురు అనారోగ్య సమస్యలను సైతం ఎదుర్కొన్నారు. తాజాగా కాంతార విషయంలోనూ ఇదే జరుగుతుండటంతో మరోమారు చంద్రముఖి అంశాన్ని నెటిజన్లు తెరపైకి తీసుకొస్తున్నారు. చంద్రముఖి విషయంలో జరిగిందే.. కాంతారా చిత్రానికి జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bengaluru Constable: కిలాడీ దొంగ.. ఏకంగా పోలీస్ డ్రెస్ కొట్టేసి.. భార్యకు వీడియో కాల్!

అతీత శక్తి వారిని చంపేస్తోందా?
కాంతార చిత్రాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతుండటంతో పలువురు సోషల్ మీడియా వేదికగా తమదైన రీతిలో జోస్యం చెబుతున్నారు. ఈ సినిమాలో చూపించిన వరాహ స్వామికి కోపం రావడం వల్లే వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ సమయంలో సరైన నియమ, నిబంధనలను చిత్ర యూనిట్ పాటించకపోయి ఉండొచ్చని.. దాని వల్లే దేవుడికి కోపం వచ్చిందని అంచనా చేస్తున్నారు. అయితే చంద్రముఖి సమయంలోనూ ఇలాంటి నిరాధార ప్రచారమే జరిగింది. చంద్రముఖి ఆత్మకు కోపం రావడం వల్లే అందులో నటించిన వారిని బలితీసుకుందన్న ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ పూర్తిగా మూఢ నమ్మకాలు మాత్రమే. చంద్రముఖిలో నటించిన రజనీకాంత్, జ్యోతిక, శోభన, ప్రభు, నయనతార, వడివేలు వంటి నటీనటులు ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అలాగే కాంతారలో నటించిన స్టార్ క్యాస్ట్ రిషబ్ శెట్టి, దర్శకులు సైతం ‘కాంతార 2’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. కాబట్టి కాంతార చిత్రయూనిట్ మరణాలు సహజమైనవి. షూటింగ్ సమయంలో జరిగిన ఘటనలు కూడా ప్రమాదవశాత్తు జరిగినవేనని సినీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

Also Read This: Samantha: నాగచైతన్యకి రాఖీ కట్టిన సమంత.. వీడియో వైరల్

Just In

01

Telugu Thalli Flyover: తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్.. స్వాగత తోరణం ఏర్పాటు

Bathukamma 2025: సాగర తీరాన ఘనంగా సద్దుల బతుకమ్మ.. హాజరైన మంత్రులు

Hyderabad Collector: గాంధీ జయంతి ఏర్పాట్లను స్పీడప్ చేయాలి.. కలెక్టర్ హరిచందన కీలక అదేశాలు

OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత