Cyber security bureau: చైల్డ్ పోర్నోగ్రఫీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. నానాటికి పెరిగిపోతున్న ఈ విష సంస్కృతికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 151మంది పోలీసులకు వారం రోజులపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధాన కార్యాలయంలోని సైబర్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఏయేటికాయేడు రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ(Child pornography) కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇంటర్ నెట్(Inter Net)లో ఉండే అశ్లీల సైట్ల నుంచి చైల్డ్ పోర్నో వీడియోలను డౌన్ లోడ్(Download) చేస్తున్న కొందరు వాటిని తమ తమ వాట్సాప్(WhatsApp) గ్రూపులతోపాటు వేర్వేరు సోషల్ మీడియా(Social Media) ప్లాట్ ఫాంలలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలా సర్క్యులేట్ అవుతున్నచైల్డ్ పోర్నోగ్రఫీ(Child pornography) వీడియోలు చూస్తూ కొందరు తమ వికృత వాంఛలకు చిన్నారులను బలి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను అప్ లోడ్(Upload) చేస్తున్న వారిలో అధికశాతం మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు ఉండటం.
టిప్ లైన్ నివేదికలు
కాగా, పెరిగిపోతున్న చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి యూఎస్ఏ(USA)కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్(National Center for Missing and Exploited Children) నుంచి ఎప్పటికప్పుడు తెలంగాణ(Telangana) సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు టిప్ లైన్(Tip Line) నివేదికలు అందుతున్నాయి. వీటి ఆధారంగా అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇలా వచ్చిన 561 టిప్ లైన్ ల ఆధారంగా 510 ఎఫ్ఐఆర్(FIR) లను జారీ చేశారు. పలువురు నిందితులను అరెస్ట్ కూడా చేశారు.
Also Read: Charmy Kaur: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఛార్మి.. ఆ డైరెక్టర్ ను కూడా వదల్లేదా?
తీవ్రత దృష్ట్యా
కాగా, కేసుల సంఖ్య పెరిగి పోతుండటంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్(Shikha Goyal) దీనిపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 పోలీస్ యూనిట్ల నుంచి 151మంది దర్యాప్తు అధికారులకు సైబర్ అకాడమీ(Syber Academy)లో వారం రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. పోక్సో(POCSO), ఐటీ(IT), బీఎన్ఎస్(BNS), బీఎన్ఎస్ఎస్(BNSS) చట్టాలపై వీరికి అవగాహన కల్పించారు. ఓఎస్ఐఎన్టీ (OSINT)అండ్ ఫోరెన్సిక్ టూల్స్ అయిన Cyniq, C-Trace, Khoj, ICACCOPS తదితర డిజిటల్ ఆధారాల విశ్లేషణా టూల్స్ ను ఉపయోగించి దర్యాప్తు జరపాలో తెలిసేలా చేశారు.
డివైస్ల స్వాధీనం, కంటెంట్ కాపీలు(Content Copy), డిజిటల్(Digital) ఆధారాల నిర్వహణపై ట్రెయినింగ్ ఇప్పించారు. దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రాం(Instagram), ఫేస్ బుక్(Facebook) తోపాటు డేటింగ్ యాప్(Dating App) లలో చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన క్లిప్పింగులను ఎలా ట్రేస్ చేయాలో తెలియచేశారు. శిక్షణలో ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్(Indian Child Protection) అధికారులు కీలకపాత్ర వహించారు. చిన్నపిల్లల రక్షణతోపాటు సైబర్ నేరాలను నియంత్రించటానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలంగాణ(Telangana) సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.
Also Read: Bandi Sanjay on Congress: బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం!