Bandi Sanjay (Image Source: Twitter)
తెలంగాణ

Bandi Sanjay: కేసీఆర్‌కు వావి వరుసలు లేవ్.. కూతురు, అల్లుడు ఫోన్ ట్యాప్ చేయించారు.. బండి

Bandi Sanjay: సిట్ విచారణ అనంతరం బీజేపీ నేత, కేంద్ర హోమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు తాను ఇచ్చిన ఆధారాలు చూసి షాకయ్యారని బండి అన్నారు. తనదే కాకుండా సీఎం రేవంత్ (CM Revanth), హరీశ్ రావు (Harish Rao), కవిత (Kavitha) ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని పేర్కొన్నారు. మావోయిస్టుల లిస్టులో తన పేరు పెట్టి ఫోన్ ట్యాప్ చేసినట్లు బండి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్ట మొదటి బాధితుడ్ని తానేనని పునరుద్ఘటించారు.

‘భార్య భర్తల ఫోన్లూ విన్నారు’
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు వావి వరుసలు లేవని బండి సంజయ్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు సొంత బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ‘నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఏ ఆందోళనకు పిలుపు ఇచ్చిన వెంటనే తెలుసుకుని ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. గతంలోనే నాకు అనుమానం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. భార్య భర్తలు ఫోన్లు విన్న మూర్ఖులు వీళ్లు. ఎస్ఐబీ సంఘ విద్రోహ శక్తుల సమాచారం సేకరించడానికి పని చేస్తుంది. అలాంటి వ్యవస్థను అడ్డుపెట్టుకొని వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు’ అని బండి ఫైర్ అయ్యారు.

కేటీఆర్‌పై ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మావోయిస్టుల ఫోన్లు కాకుండా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారని బండి సంజయ్ మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. వారిని కూడా విచారణకు పిలవాలి. సొంత లావాదేవీల కోసం కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ పై నేను ఆందోళన చేస్తుంటే నా ఫోన్ ట్యాప్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రభాకర్ రావు గ్యాంగ్ ను సమాజం క్షమించదు. ఉరి శిక్ష వీరికి సరైన శిక్ష’ అని బండి ఫైర్ అయ్యారు.

Also Read: Raksha Bandhan: రోటీన్‌కు భిన్నంగా.. అద్భుతమైన రాఖీ కొటేషన్స్.. ఇవి చాలా స్పెషల్ గురు!

సీబీఐకి అప్పగించండి
కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి డబ్బులను ఫోన్ ట్యాప్ చేసే పట్టుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అలా పట్టుకున్న రూ.7 కోట్లు కేసీఆర్, కేటీఆర్ వద్దకు చేరాయని ఆరోపించారు. సిట్ అధికారులపై తమకు నమ్మకం ఉందని.. విచారణలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు. లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కు అప్పగించాలని పట్టుబట్టారు. ఏ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు లేవని.. ఈ రాష్ర్టంలో ఎందుకు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Also Read This: Mrunal Thakur: సీరియ‌ల్‌లో సైడ్ యాక్ట‌ర్‌గా మొదలైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?