Nani Look in The Paradise
ఎంటర్‌టైన్మెంట్

The Paradise Film: ‘ది ప్యారడైజ్‌’లో రెండు జడలతో నేచురల్ స్టార్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

The Paradise Film: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందు వచ్చిన గ్లింప్స్‌లో నాని చూసిన తర్వాత.. ఇప్పటి వరకు ఆయన చేయని పాత్రలో, ఓ వైవిధ్యమైన పాత్రను చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. మళ్లీ ఆ అప్డేట్ తర్వాత ఇంత వరకు ఎటువంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ మూవీ నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ ఆగస్ట్ 8, శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన లుక్‌తో మరోసారి నాని పేరు టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది.

Also Read- Mrunal Thakur: సీరియ‌ల్‌లో సైడ్ యాక్ట‌ర్‌గా మొదలైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఈ ఫస్ట్ లుక్‌ని గమనిస్తే.. ‘రగ్గడ్ మీసం, గుబురు గెడ్డం, రెండు జడలతో నాని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపించారు. విశేషం ఏమిటంటే.. ఆ రెండు జడలే ఆయన పాత్రకు పేరుగా పెట్టడం. అవును, ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని పాత్ర పేరు ‘జడల్’ (Jadal). టైటిలే కాదు.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్‌లో కూడా ఫైర్‌ కనిపిస్తోంది. జడల్ వెనక, కత్తులు-బుల్లెట్లతో తయారైన భారీ రౌండ్ వీల్, ఒక రకమైన డేంజర్‌ని తలపిస్తోంది. పొగమంచులో ఎగిరే కాకులు, గన్ వీల్.. కింద స్క్విడ్ గేమ్ తరహాలో చైన్, దానిపై మనుషులు పరుగులు పెడుతుండటం గమనించవచ్చు. ‘It started as a braid. It ended as a revolution.” అనే క్యాప్షన్ సినిమాపై మరింత క్యురియాసిటీని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. టైటిల్‌ని టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

Also Read- Mayasabha Review: దేవా కట్టా ‘మయసభ’ వెబ్ సిరీస్ రివ్యూ

ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ బూతులతో కామెంట్స్ చేస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం నానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా పోస్టర్‌లోని టైమ్ ఫ్రేమ్‌ని చూపిస్తూ.. ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరిగిందో.. ఎవరికైనా ఐడియా ఉందా? అని అడుగుతున్నారు. అలాగే డిఫరెంట్ జానర్ ట్రై చేయాలంటే నీ తర్వాతే ఎవరైనా బాయ్.. పోస్టర్ కుమ్మింది అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతోంది. మరికొందరేమో.. ‘జడల్.. నిన్ను చూస్తే శత్రువులు హడల్’ అంటూ పంచ్‌లు పేలుస్తున్నారు. రాఘవ జూయాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 26 మార్చి, 2026లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ