Mrunal Thakur
ఎంటర్‌టైన్మెంట్

Mrunal Thakur: సీరియ‌ల్‌లో సైడ్ యాక్ట‌ర్‌గా మొదలైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఒక వారం రోజుల నుంచి ఈ పేరు సోషల్ మాధ్యమాలలో ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తుందని, విడాకులు తీసుకున్న ఆ హీరోని పెళ్లి చేసుకునేందుకు ఆ ఫ్యామిలీతో పరిచయం పెంచుకుంటుందనేలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతుండటంతో.. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు వార్తలలో బాగా హైలైట్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’ (Sita Ramam) సినిమాతో పరిచయమైన మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాలీవుడ్‌లోనే కాకుండా, టాలీవుడ్‌లోనూ ఆమెకు వరుస ఆఫర్లు వస్తుండటంతో ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా మారిపోయింది మృణాల్ ఠాకూర్.

Also Read- Pranitha Subhash: రీ ఎంట్రీకి సిద్ధమైన పవన్ కళ్యాణ్ వర్ణించిన బాపుగారి బొమ్మ.. ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది!

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్‌ ఆస్తులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 33 కోట్లు అనేది ఈ న్యూస్‌లోని సమాచారం. అంతేకాదు, ఆమె రెమ్యునరేషన్ సినిమా సినిమాకు ఎలా పెరుగుతుందో కూడా ఈ వార్తలలో హైలైట్ అవుతుండటం విశేషం. సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ మాత్రం కోట్లలో పెరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ‘సూపర్ 30’ చిత్రానికి రూ. కోటి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ చిత్రానికి రూ. 85 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత కోటి రూపాయల నటిగా మారిపోయింది. నానితో చేసిన ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రానికి రూ. కోటి పారితోషికం తీసుకున్న మృణాల్.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) చిత్రానికి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం చూస్తుండే.. ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే బాలీవుడ్‌లో ఆమె చేసిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ చిత్రానికి రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందనేలా ఓ న్యూస్ సంచరిస్తోంది. మొత్తంగా కలిపి.. ఆమె నికర ఆస్తి రూ. 33 కోట్లు అనేలా బాలీవుడ్‌లో లెక్కలు చెబుతున్నారు. అయితే ఆమెకు ఈ స్టార్‌డ‌మ్ ఓవ‌ర్‌నైట్‌లో రాలేదు. ఆమె ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్టేజ్‌కి చేరుకున్నారని అతి కొద్దిమందికే తెలుసు.

Also Read- Jatadhara Teaser Review: సుధీర్ బాబు వర్సెస్ సోనాక్షి సిన్హా.. ‘జటాధర’ మూవీ టీజర్ ఎలా ఉందంటే..

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్‌కు చేరుకుంది మృణాల్. కెరీర్‌లో ఎన్నో అవమానాలను దాటుకుని ఈ రోజు స్టార్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మృణాల్ ఠాకూర్‌ యాక్టింగ్ కెరీర్ సీరియ‌ల్స్‌తో మొద‌లైంది. ‘ముఝ్‌సే కుఛ్ కెహ‌తీ యే కామోషియాన్, అర్జున్’ అనే సీరియ‌ల్స్‌లో సైడ్ పాత్రలు చేసిన ఆమె.. ‘కుంకుమ‌ భాగ్య’ సీరియ‌ల్‌లో సెకండ్ లీడ్‌ ఛాన్స్ ద‌క్కించుకుంది. సైడ్ క్యారెక్ట‌ర్స్, సెకండ్ లీడ్ పాత్రలే అయినప్పటికీ.. సీరియ‌ల్స్ ద్వారానే మృణాల్ టాలెంట్ బయటపడింది. వెండితెర అరంగేట్రం చేసిన మృణాల్‌కు వెంటవెంటనే అవకాశాలేం రాలేదు.. ఆమె యాక్టింగ్ టాలెంట్, గ్లామర్ ట్రీట్ తెలియడానికి చాలా టైమే పట్టింది. ప్రస్తుతం సక్సెస్‌తో పని లేకుండా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?