lokesh (image :X)
ఎంటర్‌టైన్మెంట్

Coolie:ఆ బ్లాక్ కోసం రెండేళ్లు పనిచేశా.. గూస్‌బంప్స్ వచ్చేలా ఉంటుంది

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న “కూలీ” (Coolie) సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సినిమా గురించి పలు వషయాలు చెప్పుకొచ్చారు. లోకేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్లాక్ ను రెండు సంవత్సరాల పాటు ఖచ్చితమైన ప్రణాళికతో రూపొందించినట్లు తెలిపారు. ఈ ఇంటర్వెల్ సన్నివేశం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించనుందన్నారు. రజనీకాంత్ అభిమానులతో కలిసి థియేటర్‌లో ఈ సన్నివేశాన్ని చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ ఇంటర్వెల్ బ్లాక్‌ను తనకు అత్యంత ఇష్టమైన సన్నివేశంగా పేర్కొన్నారు. ఇది రజనీకాంత్ గ్రాండ్ మాస్ ఇమేజ్‌ను మరింత బలంగా ప్రొజెక్ట్ చేస్తుందని తెలిపారు.

Read also- TG School Holidays: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు.. తేదీలు ఇవే!

లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. “విక్రమ్”,”లియో” చిత్రాల్లోని ఇంటర్వెల్ సన్నివేశాలు చూస్తే గూస్‌బంప్స్ వచ్చేలా ఉంటాయి. “కూలీ”లోని ఇంటర్వెల్ కూడా అలాంటి ఒక హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అభిమానులు తారా స్టాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం రజనీకాంత్ మాస్ అప్పీల్‌ను, లోకేష్ స్టైలిష్ యాక్షన్ కథనాన్ని మిళితం చేస్తూ, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించనుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read also- Coolie: ఓవర్సీస్‌లో రికార్డులు తిరగరాస్తున్న రజనీకాంత్ ‘కూలీ’

విడుదలకు ముందే ‘కూలీ’ రికార్డులు
రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లో రూ. 10 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే 50,000కు పైగా టిక్కెట్లు అమ్ముడై, భారతీయ సినిమా రంగంలో రికార్డు నెలకొల్పింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించింది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్ నటిస్తుండగా, ఆమిర్ ఖాన్ కామియో పాత్రలో కనిపించనున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!