Vijay Deverakonda
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: ఈడీ అధికారుల విచారణలో విజయ్ ఏం చెప్పారంటే?

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ ప్రచారం నిమిత్తం టాలీవుడ్‌లోని కొందరు సెలబ్రిటీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి స్టార్ హీరోతో పాటు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్ వంటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆల్రెడీ బుల్లితెరకు చెందిన సెలబ్రిటీలెందరినో పోలీసులు ఈ విషయమై విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతొచ్చింది. బుధవారం విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. అనంతరం రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు మధ్య ఉన్న తేడా గమనించాలని అందరినీ ఆయన కోరారు. తను ప్రమోషన్ చేసింది రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్‌ని మాత్రమే అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. విచారణ అధికారులకు కూడా ఇదే వివరించానని.. విచారణ అనంతరం మీడియాకు తెలియజేశారు విజయ్ దేవరకొండ.

Also Read- Chiranjeevi: రాజకీయాల్లో లేకపోయినా నాపై విమర్శలు.. అయినా ఎందుకు స్పందించనంటే?

మీడియాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ వేరు, మీరనుకుంటున్న బెట్టింగ్ యాప్స్ వేరు. వీటి మధ్య తేడా ఏంటనేది మీడియా మిత్రులు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్.. ఇండియన్ క్రికెట్ టీమ్, ఒలంపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లకు స్పాన్సర్స్ చేస్తుంటాయి. వీటిలో నేను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్‌ను మాత్రమే. అది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్. విచారణలో ఈడీ అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ డిటైల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ అందించాను. నేను ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు కూడా సంతృప్తి చెందారు. ఈ దేశంలో ఏది కరెక్ట్? ఏది కాదు? అని నిర్ణయించేందుకు సుప్రీం కోర్టు ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి. వారు నిర్ణయిస్తారు. అంతకంటే ముందే ఎవరెవరో ఏదేదో రాసేస్తూ, తీర్పులు ఇచ్చేస్తున్నారు. అది మంచి కాదని చెప్పుకొచ్చారు.

Also Read- Khadgam Actress: విడాకులు తీసుకోబోతున్న రవితేజ హీరోయిన్.. పెద్ద హింటే ఇచ్చిందిగా?

సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నదమ్ముల ఎమోషనల్ బాండింగ్‌తో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే టాప్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యాన్‌ దర్శకత్వంలోనూ, ర‌వి కిరణ్ కోలా దర్శకత్వంలోనూ విజయ్ సినిమాలు చేస్తున్నారు. ‘కింగ్‌డమ్’ సినిమాకు ముందు విజయ్ వరుస పరాజయాలను చవిచూసిన విషయం తెలిసిందే. అందుకే ‘కింగ్‌డమ్’ సక్సెస్ విజయ్ కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లతో నిర్మాత హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘కింగ్‌డమ్’ సక్సెస్ ప్రాజెక్ట్‌గా విజయ్ దేవరకొండ, ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!