Manchu Vishnu
ఎంటర్‌టైన్మెంట్

Manchu Vishnu: తక్షణం అమల్లోకి.. మంచు విష్ణు సంచలన నిర్ణయం

Manchu Vishnu: ఈ రోజు (బుధవారం) క్యాస్టింగ్ మేనేజర్స్‌తో మంచు విష్ణు సమావేశమయ్యారు. ఇక నుంచి ఆర్టిస్ట్‌లు అవార్డుల ఫంక్షన్లలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే.. ‘మా’ అసోసియేషన్ అనుమతి తప్పనిసరి చేస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవార్డ్ ఫంక్షన్లతో పాటు ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా, సినీ ఆర్టిస్ట్‌లు ఏ విధమైన (డ్యాన్స్, స్కిట్స్, మిమిక్రీల వంటివి) పెర్ఫార్మెన్స్ చేసినా ‘మా’ అసోసియేషన్ అనుమతి తప్పనిసరి చేశారు. గతంలో చాలా అవార్డుల ఫంక్షన్లలో పెర్ఫామ్ చేసిన నటీనటులకు పారితోషికం ఇవ్వలేదని చెబుతూ..  క్యాస్టింగ్ మేనేజర్స్ అందరూ ‘మా’ అసోసియేషన్‌తో టై-అప్ పెట్టుకుని, మంచు విష్ణుని బుధవారం కలిసి వివరాలు తెలిపారు. ఇకపై ‘మా’ అసోసియేషన్ అనుమతి తప్పని సరిగా తీసుకుని ఈవెంట్ మేనేజర్స్  ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చని, ఇది ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ నటీనటులు ఎక్కడ పెర్ఫార్మెన్స్ చేసినా అమల్లో ఉంటుందని, దీనికి ‘మా’ అసోసియేషన్ అనుమతి తప్పనిసరి అని మంచు విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు. అనుమతి లేకుండా పెర్ఫామ్ చేసిన నటీనటులకు పారితోషికం రాకపోతే ‘మా’ బాధ్యత వహించదని మంచు విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read- Chiranjeevi: రాజకీయాల్లో లేకపోయినా నాపై విమర్శలు.. అయినా ఎందుకు స్పందించనంటే?

‘మా’ మెంబర్స్‌కి అండగా నిలబడిన మంచు విష్ణు

మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంతో మా మెంబర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా ఈవెంట్స్‌లో డ్యాన్స్ చేసి, చివరి నిమిషంలో పారితోషికం విషయంలో ఎంతగానో నష్టపోయిన వారంతా, ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మంచు విష్ణు పెట్టిన ఈ రూల్‌తో ఆర్టిస్ట్‌లకు చాలా మంచి జరుగుతుందని, మరీ ముఖ్యంగా ఎంతో కష్టపడి స్టేజ్‌పై పెర్ఫార్మ్ చేసిన అనంతరం, దానికి సంబంధించిన పారితోషికం రాకపోతే ఎంత బాధగా ఉంటుందో.. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా వాళ్లు అంగీకరించిన ఫంక్షన్లలో పెర్ఫార్మ్ చేయడానికి కొందరు కొన్ని నెలలు, రోజులు కష్టపడుతుంటారు. తీరా, ఫంక్షన్ సక్సెస్ అయిన తర్వాత పెర్ఫార్మ్ చేసిన వారికి ఇవ్వవలిసిన పారితోషికాలు ఇవ్వకుండా.. తిప్పించుకునే వారు కూడా ఉన్నారు. ఇలాంటి వాటన్నింటికి చెక్ పెట్టేందుకు, మంచు విష్ణు ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలులోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రూల్ ప్రకారం, ఎవరైనా ఆర్టిస్ట్‌కు పారితోషికం రాకపోతే.. ‘మా’ బాధ్యత తీసుకుంటుంది. అలాగే ‘మా’ అసోషియేషన్ అనుమతి లేకుండా పెర్ఫార్మ్ చేస్తే మాత్రం, వారికి ఏదైనా కష్టం వస్తే ‘మా’ బాధ్యత వహించదని మంచు విష్ణు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ‘మా’ మెంబర్స్‌కి అండగా నిలబడిన మంచు విష్ణుపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read- War 2: ‘వార్ 2’ మేకర్స్ పెద్ద ప్లానే వేశారుగా.. ‘కూలీ’ ఇక ఢమాల్!

ఈ నిర్ణయం మంచిదే

మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని అంటున్నారు మా అసోసియేషన్ మెంబర్స్. గతంలో ఎందరో హీరోయిన్లు ఈవెంట్స్ చేసి, వారి పారితోషికాలు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకుంటున్నారు. ఇకపై ఎటువంటి కార్యక్రమమైనా సరే.. ఆ కార్యక్రమంలో డ్యాన్స్ ఇతరత్రా పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్‌లు చేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా అనుమతి తీసుకోవాలనే నిర్ణయాన్ని అంతా సమర్థిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ