Tummala Nageswara Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Tummala Nageswara Rao: కేంద్రమంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ

Tummala Nageswara Rao: రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda)కు లేఖ రాశారు. ఆగస్టులో ధాన్యం, పత్తి(Cotton), మక్క వంటి పంటలకు యూరియా(Urea)ను పైపాటుగా వాడుతారని, ఇలాంటి పరిస్థితులలో యూరియా సరఫరాలో ఎలాంటి ఆలస్యం తలెత్తిన పంటల దిగుబడులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.

3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా 

అయితే, ఆగస్టు(Augst) నెలలో పంటల అత్యధిక యూరియా(Urea) వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతోందని అంచనా వేశామన్నారు. గత ఏప్రిల్ 1 నుంచి జూలై 31వరకు రాష్ట్రానికి 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 4.51 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా మాత్రమే జరిగిందన్నారు. ఇదే సమయంలో ఏప్రిల్(April) ప్రారంభం నాటి నిల్వలు కూడా వాడుకొని 5.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు విక్రయించడం జరిగిందని తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: కొల్లాపూర్‌లో నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాను

ఆగస్టులో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించి, అందులో 1.31 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయంగా, 0.39 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి ద్వారా ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఇందులో దిగుమతిగా రావాల్సిన యూరియాకు సంబంధించి షిప్ మెంట్ వివరాలు ఇంకా రాలేదని మంత్రి అన్నారు. అంతేకాకుండా దేశీయ సంస్థలైన పీపీఎ(PPL)ల్ నుంచి 11,000 మెట్రిక్ టన్నులు, ఎంసీఎఫ్ఎల్(MCFL) నుంచి 7,000 మెట్రిక్ టన్నులు ఆగస్టులో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, వారు సరఫరా చేయలేమని తెలిపారన్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

సాగు అవుతున్న పంటలకు యూరియా

ఈ ఆగస్టులో సరఫరా చేయలేమని చెప్పిన పీపీఎల్(PPL), ఎంసీఎఫ్ఎల్(MCFL) తో ఏర్పడిన 18,000 మెట్రిక్ టన్నుల కొరతను ఆర్ఎఫ్సీఎల్(FFCL) తో భర్తీ చేయాలని, ఆగస్టు నెలలో కేటాయించిన విధంగా రాష్ట్రానికి దిగుమతి ద్వారా అందాల్సిన 39,600 మెట్రిక్ టన్నుల యూరి(Urea)యాను ఈ నెల 20వ తేదీకి ముందు రాష్ట్రానికి చేరే నౌకల ద్వారా ఇవ్వాలని, దాంతో పాటు ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఏర్పడిన 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరతను కూడా ఆగస్టు నెలలో మంజూరు చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగు అవుతున్న పంటలకు యూరియా లభ్యత నిరవధికంగా ఉండేలా చూసేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: Kaleswaram: కాక రేపుతున్న కాళేశ్వరం నివేదిక.. వెలుగులోకి సంచలన నిజాలు

Just In

01

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Minister Sridhar Babu: గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

High Court: టీజీపీఎస్సీ హైకోర్టులో భారీ ఊరట.. నియామకాలు చేపట్టవచ్చని డివిజన్​ బెంచ్​!

GHMC: జీహెచ్ఎంసీ మూడు కీలక శాఖ అధికారులకు స్థానచలనం.. ఉత్తర్వులు జారీ!

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!