Gurram Papireddy: ప్రేక్షకులకు కొత్త రకం వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా. ఈ చిత్రం టీజర్ విడుదలై, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన డార్క్ కామెడీ జానర్‌లో తెరకెక్కించారు. ఇది తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని కొత్త అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నారు నిర్మాతలు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమా కామెడీ జోనర్ లో ఉండబోతుందని తెలిపేలా ఉన్నాయి. దీంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా ప్రేక్షకులు. ఎప్పుడూ చూడని డార్క్ కామెడీ కథ ఈ సినిమాలో ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Read also- Viral Video: రోజూ వంట చేస్తాడు.. బిడ్డకు తల్లిని చేశాడు.. అందుకే భారతీయుడ్ని చేసుకున్నా!
ఈ సినిమాకు సంబంధించి టీజర్‌లాంచి ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. బ్రహ్మానందం మాట్లాడుతూ.. “గుర్రం పాపిరెడ్డి” సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్ గా చూపించాడు. ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్లతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించాను. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హీరో నరేష్, హీరోయిన్ ఫరియా సహా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అని అన్నారు.
Read also- Coolie Vs War 2: ఓవర్సీస్ లో ‘కూలీ’ Vs ‘వార్ 2’ సినిమాల్లో గెలుపెవరిదంటే..
‘పదహారో శతాబ్దం మనకు స్వాతంత్ర్యం రాక ముందు, రాయలసీమలో’ అంటూ మొదలయ్యే టీజర్ ఆద్యంతం నవ్వుల పూవులు పూయిస్తుంది. గర్రం పాపిరెడ్డిగా నరేష్ అగస్త్య నరేష్ అగస్త్య టైమింగ్, వంశీధర్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి ఫన్ పంచ్‌లు హాస్యాన్ని పండించగా, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. న్యాయ మూర్తిగా కనిపించి బ్రహ్మానందం ఎప్పటిలాగే తన ఎంట్రీతో కామెడీని పండించాడు. కామెడీ టైమింగ్స్ అదిరాయనే చెప్పవచ్చు ఈ సినిమాలో. సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు, ఇతను గతంలో ‘సింబా: ది ఫారెస్ట్ మ్యాన్’ చిత్రంలోని ‘ప్రేమ గీమా’ పాటతో గుర్తింపు పొందారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.