Garividi Lakshmi: టాలీవుడ్‌లో భారీ స్థాయి సినిమాలతో టాప్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంస్థ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని ‘గరివిడి లక్ష్మి’ (The Legendary Folk Singer Garividi Lakshmi) కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో ఆనంది (Anandhi) నటిస్తున్న ఈ చిత్రానికి గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, వాటిని ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా చూపించబోతోందని మేకర్స్ చెబుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోందని టీమ్ తెలుపుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
Read also- Ghaati: అనుష్క శెట్టి ‘ఘాటీ’ ట్రైలర్ ఎప్పుడంటే..?
‘నల జీలకర్ర మొగ్గ, నా నల జీలకర్ర మొగ్గ’ అంటూ మొదలయ్యే పాటలో అలనాటి బుర్రకథను గుర్తుకు తెచ్చేదిగా ఉంది. అప్పటి పల్లె టూల్లు అక్కడ ప్రధాన వినోదంగా సాగే బుర్రకథను చూడటానికి వచ్చిన జనం. చూస్తుంటే ఒక్కసారి అప్పట్లో రోజులు గుర్తుతెచ్చేవిగా ఉన్నాయి. జనం కేరింతలు, ఫోక్ ఐకాన్‌గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో పాట నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళిందని చెప్పవచ్చు. లక్ష్మిగా ఆనంది పెర్ఫార్మెన్స్‌ను చూస్తుంటే ఆ కేరెక్లర్ లో ఒదిగిపోయినట్లుగా ఉంది. ఆమె పాటలు వింటూ ఎదిగిన 90స్ తరం మళ్లీ అలానే ఫీల్ అవుతుందని, ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన రోజులను గుర్తు చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 15 ఏళ్లలో 10,000 స్టేజీలను తాకిన గాయనీ జీవితాన్ని రిక్రియేట్ చేస్తున్న చిత్రమిది. చరణ్ అర్జున్ అందించిన నేపథ్య సంగీతం ఈ పాటలోని విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేస్తోంది. పాటలు, సంగీతం, ఆర్ట్– ఇవన్నీ కలిసి ఈ పాటని చూడగానే నచ్చేసేలా చేశాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి అంటే అతిశయోక్తి కానే కాదు. అంత అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించారు.
Read also- Coolie Vs War 2: ఓవర్సీస్ లో ‘కూలీ’ Vs ‘వార్ 2’ సినిమాల్లో గెలుపెవరిదంటే..
‘గరివిడి లక్ష్మి’ మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి జె. ఆదిత్య సినిమాటోగ్రపీని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా ఉంటాయని టీమ్ చెబుతోంది. నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని వంటి వారు ఈ సినిమాలో ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.