Actress Urvashi: తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ సహాయ నటిగా ఊర్వశి ఎంపికైన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల ఆమె.. క్రిస్టో టోమి దర్శకత్వంలో రూపొందిన ‘ఉల్లోజుక్కు’ (Ullozhukku) చిత్రానికి గాను ఈ అవార్డ్ అందుకోనున్నారు. ఈ సినిమాలో లీలమ్మ పాత్ర పోషించిన ఆమె.. ప్రేక్షకుల మన్ననలు పొందారు. అయితే తనకు వచ్చిన నేషనల్ అవార్డ్ గురించి నటి స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు.
నటి ఏమన్నారంటే?
మనోరమా న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ఊర్వశి మాట్లాడారు. నేషనల్ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఉత్తమ నటి కేటగిరీలో తనను పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఉత్తమ నటి అవార్డు గెలుచుకోవాలంటే నేను ఇంకా చిన్న వయసులో ఉండాలా?’ అని ప్రశ్నించారు. ఉల్లోజుక్కులో తను పోషించిన పాత్రను సపోర్టింగ్ రోల్ గా ఎందుకు వర్గీకరించారని ఆమె ప్రశ్నించారు. ‘నటనకు ఏమైనా ప్రామాణిక ప్రమాణాలు ఉన్నాయా? లేక వయసు పెరిగిన తర్వాత అంతేనా?’ అని వ్యాఖ్యానించారు.
Also Read: Ustad Bhagat Singh: పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ఘర్షణ.. సమ్మె జరుగుతుంటే షూటింగ్ ఎలా నిర్వహిస్తారు?
‘ఇది పెన్షన్ డబ్బు కాదు’
జాతీయ అవార్డు అంటే గర్వంగా స్వీకరించేలా ఉండాలని నటి ఊర్వశి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఏ వివరణ లేకుండా అందించడం సరైంది కాదని పేర్కొన్నారు. ‘ఇది పెన్షన్ డబ్బు కాదు. ఈ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఎలాంటి ప్రమాణాలను అనుసరిస్తారు?’ అని ప్రశ్నించారు. 2006లోనూ ఇదే అనుభవం తనకు ఎదురైందని ఆమె చెప్పారు. ‘అచువింటే అమ్మ’ (Achuvinte Amma) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఉత్తమ సహాయ నటి అవార్డుకు ఎంపిక చేశారు. ఆ సమయంలోనూ పాలిటిక్స్ ఉన్నాయి. అయినా ఎలాంటి లాబీయింగ్ చేయకుండా అర్థవంతమైన సినిమాలు చేయడానికే కృషి చేస్తున్నాను’ అని నటి చెప్పుకొచ్చారు.
అవార్డులు దక్కించుకున్న చిత్రాలు/నటులు వీరే
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి- రాణి ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరి
ఉత్తమ చిత్రం (తెలుగు)- భగవంత్ కేసరి
ఉత్తమ చిత్రం (తమిళం)- పార్కింగ్
ఉత్తమ చిత్రం (హిందీ)– కథల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
ఉత్తమ చిత్రం (పంజాబీ)– గాడ్డే గాడ్డే చా
ఉత్తమ చిత్రం (ఒడియా): పుష్కర
ఉత్తమ చిత్రం (మరాఠీ): షామ్చియాయ్
ఉత్తమ చిత్రం (మలయాళీ): ఉళ్ళోలుక్కు
ఉత్తమ చిత్రం (కన్నడ): కండీలు-ది రే ఆఫ్ హోప్
ఉత్తమ చిత్రం (గుజరాతీ): వష్
ఉత్తమ చిత్రం (బెంగాలీ): డీప్ ఫ్రిడ్జ్
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్
ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్వశి, వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా
ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్, పార్కింగ్ (తమిళ్) ముత్తుపెట్టాయ్ సోము భాస్కర్