Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’ (Coolie). సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. కింగ్ నాగార్జున (King Nagarjuna) పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్ (Aamir Khan) గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కాలేదు కానీ, ఓ వీడియో బైట్‌ను పంపించారు. ఈ వీడియోలో..
‘‘తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు. డైమండ్ జూబ్లీ ఇయర్. ఈ ఇయర్‌లో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘కూలీ’ సినిమా చేస్తున్నాను. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్ట్ 14న డైమండ్ జూబ్లీ పిక్చర్ వస్తోంది. లోకేష్ కనగరాజ్ అంటే ఇక్కడ (తమిళ్) రాజమౌళితో సమానం. ఎలాగైతే రాజమౌళి చేసిన సినిమాలన్నీ హిట్టో.. ఇక్కడ లోకేష్ కనగరాజ్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అలాంటి లోకేష్‌తో ఈ సినిమా చేస్తున్నాను.
Also Read- Actress Urvashi: ‘ఉత్తమ నటి కావాలంటే.. యంగ్‌గా ఉండాలేమో’.. నటి షాకింగ్ కామెంట్స్!
ఈ సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. స్టార్ క్యాస్టింగ్. సత్యరాజ్.. చాలా సంవత్సరాల తర్వాత సత్యరాజ్‌తో నేను పని చేస్తున్నాను. శృతి హాసన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.. ఆయన ఎలాంటి ఆర్టిస్టో అందరికీ తెలుసు. ఆయన కూడా ఇందులో ఓ పాత్ర చేస్తున్నారు. సౌబిన్ షాహిర్.. ఇందులో దయాళ్ అనే విలన్ పాత్ర చేస్తున్నారు. ఇంకోటి దోహ అని ఆమిర్ ఖాన్.. ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్‌లో స్పెషల్ అప్పీరియెన్స్ ఇస్తున్నారు. ఆయన ఇలా చేస్తుండటం ఇదే ఫస్ట్ టైమ్.
ఇంకా పెద్ద అట్రాక్షన్ ఏమిటంటే.. కింగ్ మన నాగార్జున ఇందులో యాంటీ క్యారెక్టర్ చేస్తున్నారు. విలన్‌గా చేస్తున్నారు. సబ్జెక్ట్ విన్న వెంటనే అసలు ఆ పాత్ర నేనే చేయాలని అనుకున్నా. ఎందుకంటే, నాకు విలన్‌గా చేయాలంటే చాలా ఇష్టం. బేసిగ్గా నేను విలన్‌ని కదా. చాలా స్టైలిష్ క్యారెక్టర్ అది. ఎవరు చేస్తారు.. ఎవరు చేస్తారు? అని అనుకుంటూ ఉన్నాం. చాలా ఫెంటాస్టిక్ క్యారెక్టర్. 6 మంత్స్ వరకు ఎవరినీ ఆ పాత్రకి ఎంపిక చేయలేదు. తర్వాత లోకేష్ నా దగ్గరకు వచ్చి, ఇప్పటికి 6 సార్లు అతనితో మీటింగ్ అయిపోయింది. ఎలాగైనా ఈ సినిమాలోకి ఆయన్ని తీసుకు వస్తాను.. అని అంటే.. ఎవరతను ఎవరతను? అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. తర్వాత ఒక రోజు.. సార్ గుడ్ న్యూస్ అని లోకేష్ చెప్పాడు. ఏంటి? అని అడిగాను. సైమన్ క్యారెక్టర్‌కి ఆయన ఓకే చేశారు అన్నాడు. ఎవరు? అని ఆతృతగా అడిగా.. కింగ్ నాగార్జున అన్నాడు. నేను షాకయ్యా. ఒప్పుకున్నారా? అని అడిగా. ఓకే చెప్పారు సార్ అన్నాడు. అప్పుడు అనుకున్నా.. కచ్చితంగా ఈ పాత్ర ఆయన డబ్బు కోసం అంగీకరించి ఉండరు. ఆయనకు డబ్బు కోసం చేయాల్సిన అవసరం లేదు కూడా. ఎప్పుడూ మంచి పాత్రలే ఎంతకాలం అని చేస్తాడు. ఈ పాత్రలో మంచి ఛేంజ్ ఉందని ఆయన ఓకే చెప్పి ఉంటాడని అనుకున్నాను.
ఆల్రెడీ నాగార్జునతో నేను 33 సంవత్సరాల క్రితం ఓ సినిమా చేశాను. మళ్లీ ఇన్నాళ్లకి మేము ఈ సినిమాలో కలిసి చేశాం. అప్పటికి, ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. ఇప్పుడే ఇంకా యంగ్‌గా ఉన్నారు. నా తలపై వెంట్రుకలన్నీ పోయాయి. ఆయన స్కిన్ టోన్, ఫిజిక్.. చూసి ఆశ్చర్యపోయి.. ఏంటి రహస్యం అని అడిగేశాను. ఏముంది సార్.. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, స్విమ్మింగ్, కొద్దిగా డైట్ అంతే. నైట్ 6.30కి డిన్నర్ అయిపోవాలి. ఆ తర్వాత ఏమి తినను అంతే.. అని చెప్పారు. మా నాన్నగారి జీన్స్, ఇంకా నాన్నగారు చెప్పినట్లు ఏదీ సీరియస్‌గా పట్టించుకోను.. అంతేనండి.. అని చెప్పారు. అదే నాగ్ లుక్ రహస్యం.
Superstar @rajinikanth garu shares a heartfelt message with all the lovely Telugu audience and talks about his experience working on #Coolie ❤️🔥❤️🔥#CoolieTelugu releasing worldwide August 14th
Telugu States release by @asianreleases#CoolieFromAug14 @iamnagarjuna @Dir_Lokesh… pic.twitter.com/WhqYXCPcdI
— Annapurna Studios (@AnnapurnaStdios) August 4, 2025
ఈ సినిమాలో నాగ్‌తో కలిసి థాయిలాండ్‌లో 17 రోజుల పాటు కంటిన్యూగా వర్క్ చేశాను. ఆయనని, ఆయనతో మాట్లాడిన ఏ విషయాన్ని కూడా నా లైఫ్‌లో మరిచిపోను. ఆయన ఇచ్చిన సలహాలు, నాలెడ్జ్.. హి ఈజ్ నాట్ ఓన్లీ హ్యాండ్సమ్.. హి ఈజ్ జెంటిల్ మ్యాన్ అంతే. సైమన్ పాత్ర నాగార్జున చేసిన తీరు చూశాక.. అసలు నేను అలా చేయగలనా? అని నాకే అనిపించింది. ఫెంటాస్టిక్.. అదరగొట్టేశాడు. ఆయన ఫ్యాన్స్ చూసి షాకవుతారు.. అంతబాగా ఆ పాత్ర చేశారు. ‘బాషా’ సినిమాలో ఆంటోని ఎలాగో.. ‘కూలీ’లో సైమన్ అలాగే. ఈ సినిమా చాలా బాగా ఆడాలి. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి, సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు